Friday, October 22, 2010

ఊరు మారినా ఉనికి మారునా ..చిత్రం: మూగనోము (1969)

ఊరు మారినా ఉనికి మారునా
మనిషి దాగినా మమత దాగునా
మరలి రాని పయనంలో మజిలీ లేదు
ఆడదాని కన్నీటికి అంతే లేదు

అనురాగ దీపం అసమాన త్యాగం
స్త్రీ జాతి కొరకే సృజియించె దైవం
చిరునవ్వులన్ని పెదవారి పరవారి కొసగి
చీకటుల లోనే జీవించు యువతి
తలపులే వీడవు వీడేది మనిషే
వలపులే వాడవు
వాడేది తనువే ..

మగవాని కేమో ఒకనాటి సుఖము
కులకాంత కదియే కలకాల ధనము
తనవాడు వీడ అపవాదు తోడ
పదినెలల మోత చురకత్తి కోత
సతులకే ఎందుకూ ఈ ఘోరశిక్ష
సహనమే స్త్రీలకు శ్రీ రామరక్ష

ఊరు మారినా ఉనికి మారునా
మనిషి దాగినా మమత దాగునా

2 comments:

Anonymous said...

Please check the title of the post

vinayakam said...

corected sir ..thank you