Monday, November 8, 2010

అడవే అడవే జలకమ్ములాట ....చిత్రం: విచిత్ర కుటుంబం (1069)

ఆడవే..ఆడవే ..
ఆడవే జలకమ్ములాడవే //2//
కలహంస లాగ జలకన్య లాగ //2//
ఆడవే......ఆడవే
ఆదికవి నన్నయ్య అవతరించిన నేల
ఆ..ఆ..ఆ...
తెలుగుభారతి అందియలు పల్కె ఈ నేల ..
ఆంధ్ర సంస్కృతికి తీయని క్షీరధారలై
జీవకళలొల్కు గోదావరి తరంగాల ఆడవే..ఆడవే
నాగార్జునుని భోధనలు ఫలించిన చోట
ఆ..ఆ..ఆ..
బౌద్దమత వృక్షంబు పల్లవించిన చోట
బుద్దం శరణం గచ్చామి ..
ధర్మంశరణం గచ్చామి
సంఘం శరణం గచ్చామి

కృష్ణవేణి తరంగిణి జాలిగుండెయె సాగరమ్మై
రూపు సవరించుకొను నీట
ఆడవే ... ఆడవే
కత్తులును ఘంటములు కదను త్రొక్కినవిచట //2//
అంగళ్ళ రతనాలు అమ్మినారట యిచట
నాటి రాయల పేరు నేటికిని తలపోయు
తుంగభద్రానదీ తోయ మాలికలందు
ఆడవే ...ఆడవే..


http://www.chimatamusic.com/playcmd.php?plist=8801

2 comments:

ఎలక్ట్రాన్ said...

చాలా మంచి పాట. పోస్టు చేసినందుకు దన్యవాదాలు

Telugu songs Free Download said...

its great to get the lyrics.thank you....