ఆనందమాయె అలినీలవేణీ ఆనందమాయె అలినీలవేణీ
అరుదెంచినావా అందాలదేవీ
ఆనందమాయె అలినీలవేణీ
ఆ ...........
అనువైన వేళా అనురాగ శోభా
అది ప్రెమ పూజా ,నా భాగ్యమాయె
ఆ.............
అలనాటి నోము కలనేడు పండే
అరుదైనా హాయి నా లోన నిండే
ఆనందమాయే అసమాన తేజా
అపురూపమైనా అందాల దేవా
అనందమాయె అసమాన తేజా
ఆ .........
సొగసైన రూపేసోలించు చూపే
సగమైన కనులా సంతొష నిధులే
ఆ ....
నగుమోము పైనా నడయాడు కళలే
అగుపించగానే మధువరు నాలో
ఆనందమాయె అలినీలవేణీ..//
ఆ...
ఎనలేని స్వామి నిను చేరపోతే
నునులేత ప్రేమా నను సాగనీదే
ఆ....
తనువేమో నీకై తపియించు నిలచి
మనసేమోనీలో మునుపే కలసి
ఆనందమాయె అసమాన తేజా....//
ఆనందమాయె అలినీలవేణీ..///
ఆ ...
No comments:
Post a Comment