Friday, April 24, 2015

1950 hits

As I was away from my home town for a long time I could not post much .
I will try my best to bring some beautiful  songs 

Monday, December 30, 2013




2013 చివారాఖరి దశ లో కొచ్చాం ఇలా వచ్చి అలా మాయమైపోతున్నాయి ఈ సంవత్సరాలు. ఒక్క వయసు పెరగడం తప్ప గొప్పగా సాధించిందేమీ లేదు . ప్రతిఏడు చివర అలా వెనక్కి వెళ్ళి రావటం అలవాటు.ఇక నా జీవితానికి మార్పులు చేర్పులు అనవసరమైనా అనుభవాన్ని పంచితేనే చరిత్రవుతుంది .

       సరిగ్గా 50 ఏళ్ళక్రితం పరిస్థితి  ఎలా ఉండేదో చూడండి  అప్పుడు
ఇడ్లి 2 = 0.05 పైసలు
దొశ 1 = 0.10 పైసలు
మలకపేట కాలనీ నుంచి కోఠీ  = 0.07 పైసలు
రిక్షా ఎక్కితె 0.25 పైసలు
సిగెరెట్టు - 0.03 పైసలు రెండు కొంటే 0.05 పైసలు.
పెట్రోలు = 0.67 పైసలు
బంగారం = 63.00 రూపాయలు
సినిమా నేలటికెట్టు 0.19 పైసలు

ఇవి చూసి మేమేదో ఆనందం పొందామనుకుంటే పొరపాటే. ఇప్పటి జీతాలతో మీరు పొందే మనస్థితే అప్పటి జీతాలతో మేం పొందింది. ఇప్పుడు అనుకోటానికి మాత్రం కైలాస శిఖరాలు ఎక్కినంత తృప్తి .

ఇక రాబోయే కాలాలు ఎలాఉంటాయో ఏమో .. అప్పటి తరం వాళ్ళకు ఈ జీవితాలే గొప్ప ఆనందాని ఇస్తాయేమో .....
    

Saturday, August 10, 2013

పిచ్చుకలు ( house sparrow )

ఈ పక్షి ని ఎపుడైనా చూసారా .ఈ నాటి కుర్రకారు చూసి ఉండకపోవచ్చు అవునా .. ఇవే ఊరు పిచ్చుకలు , గువ్వలని అంటారు .ఇంగ్లీషు లో స్పారో ..మా బాల్యం లో ఇవి ప్రతి ఇంటా తిరిగే గువ్వలు .ఇంటి చూరులోనో ఫేన్ కప్పులోనో గూళ్ళూకట్టుకుని నివసించేవి
అప్పట్లో పిల్లలు వీటిని చూసే ఆనందించేవారు.రోజు ఇంట్లో మనుషుల వలే తిరుగుతూ ,ఎగురుతూ ఉండేవి ..
నాగరికత పెరిగింది వీటి సంతతి తరిగింది..ఇప్పుడు ఎక్కడో పల్లెల్లో మాత్రం కోతలప్పుడు కనపడుతుంటాయి ...నిత్య జీవితంలో సదా పాలుపంచుకునే ఓ జాతి కనుమరుగైందనే బాధ ..


Friday, July 26, 2013

plant art at botanical garden montreal (canada )

అందరం తోటల్లో విహరించాలనే అనుకుంటాం ..మరి ఇలాంటి తోట చూడాలని అనిపిస్తోందా.. ఇక్కడ విహారం ఎంత ఉల్లాసమో కదా...
ఇది మాంట్రియల్ (కెనడా) లో బొటానికల్ గార్డన్స్ ..సందర్శన కొన్ని నెలలు మాత్రమే...


Add caption








Monday, May 6, 2013



చూసారుగా  తిరుపతి లో మేఘాల హడవుడి  .. స్వామి ని చల్లపరచాలని  తపన ....  

Tuesday, December 11, 2012

హమ్మయ్య  వర్షాలు బాగానే పడ్డాయి. కరెంటు కోతలు తగ్గాయి.
ఇక కాసేపు నా బ్లాగు బాగోగులు చూసుకోవాలి. మరి చాలా ఆలస్యం అయ్యింది కదా
ముందు కొన్ని తిరుపతిఫోటోలు పెడతాను.





Friday, September 16, 2011

కోడెకారూ చిన్నవాడా....ముందడుగు (1958 )




కోడెకారు చిన్నవాడా వాడిపోని వన్నెకాడా

కోటలోనా పాగావేసావా చల్ పూవులరంగా

మాటతోనే మనసు దోచావా


చింతపూల రైకదానా చిలిపి చూపుల చిన్నదానా

కోరికలతో కోటే కట్టావా చల్ నవ్వుల రాణి

దోరవలపుల దోచుకున్నావా


చెట్టుమీద పిట్ట ఉంది పిట్ట నోట పిలుపు ఉంది

పిలుపు ఎవరికో తెలుసుకున్నావా

చల్ పూవుల రంగా తెలుసుకుంటే కలిసి ఉంటావా


పిలుపు విన్నా తెలుసుకున్నా

పిల్లదానా నమ్ముకున్నా

తెప్పలాగా తేలుతున్నానే

చల్ నవ్వుల రాణి .. నాకు జోడుగా నావ నడిపేవా

చల్ నవ్వుల రాణి .. నాకు జోడుగా నావ నడిపేవా

కోడెకారూ....


నేలవదిలి నీరు వదిలి నేను నువ్వను తలపు మాని

ఇద్దరొకటై ఎగిరిపోదామా

చల్ పూవులరంగా గాలి దారుల తేలి పోదామా


ఆడదాని మాటవింటే తేలిపోవటం తేలికంటే

తెల్సి తెల్సి ముంచుతారంట

చల్ నవ్వులరాణీ మునుగుతుంటే నవ్వుతారంట..

చల్ నవ్వులరాణీ మునుగుతుంటే నవ్వుతారంట..

కోడెకారూ...


Wednesday, August 24, 2011

ఆడదాని ఓరచూపుతో .....ఆరాధన (1962 )

ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వరోయ్

నిజానికి జిగేలని వయారి నిన్నుచూడ కరిగిపోదువోయ్


మిఠారి నవ్వులే మిఠాయి తీపులు

కటారి రూపులోన కైపులున్నవి

రంగేళిఆటకు రడీగా ఉన్నది

రంగేళి ఆటకు రడీగా ఉన్నది

కంగారు ఎందుకోయీ .....//


ఖరీదు లేనివి ఖరారు అయినవి

గులాబి బుగ్గలందు సిగ్గులున్నవి

ఖరీదు లేనివి ఖరారు అయినవి

గులాబి బుగ్గలందు సిగ్గులున్నవి

మజాల సొగసులే ప్రజెంట్ చేసెద

మజాల సొగసులే ప్రజెంట్ చేసెద

సుఖాల తేలవొయీ....///

Friday, August 5, 2011

ఒకటే హ్రదయం కోసము ...చిత్రం : చదువుకున్న అమ్మాయిలు (1963)

గుట్టుగా లేతరెమ్మల కులుకు నిన్ను

రొట్టెముక్కల మధ్యన పెట్టిరనుచూ

ఏల ఇట్టుల చింతింతువే ..టొమాటో

అతివలిద్దరి మధ్య నా గతికనుమా...ఆ..


ఒకటే హృదయం కోసము

ఇరువురి పోటీ దోషము ../2/

ఒకటే హృదయం కోసము


ఒకరు సత్యభామ

ఒకరేమో రుక్మిణి

మధ్యనలిగినాడు మాధవుందు

ఇద్దరతివలున్న ఇరకాటమెనయా

విశ్వధాభిరామ వినురవేమా..

ఆ...ఆ..ఆ...ఓఓ..ఓఓ..ఓఓ


జతగా చెలిమి చేసిరి

అతిగా కరుణే చూపిరి

అహ హ..అహహ..ఆహహా..

చెలిమే వలపై మారితే

శివశివ మనపని ఆఖరే..

ఆ.....//ఒకటే//

ఆ..ఆ..ఆ..ఒ..ఒ..ఓ...


రామునిదొకటే బాణము

జానకి ఆతని ప్రాణము

అహహ..అహహ..

ప్రేమకు అదియే నియమము

ప్రేయసి ఒకరే న్యాయము..

ఆ...

//ఒకటే..//

Friday, July 29, 2011

ఐసరబజ్జా బుల్లెమ్మా..చిత్రం :తిక్క శంకరయ్య (1968)

హై...ఐసరబజ్జా పిల్లమ్మ అరరె అరరె బుల్లమ్మా

ఐసరబజ్జా పిల్లమ్మ అరెరె అరరె బుల్లమ్మా

ఓ..ఓ..య్య


అద్దిరబనా ఓ రాజా హాయిరే హయిరే నా రాజా

అద్దిరబనా ఓ రాజా హాయిరే హయిరే నా రాజా

ఓ..ఓ..య్య

హూప్ గిడిగిడిగిడిగిడిగిడి పిట్టా తుర్ర్..

చిఠారు కొమ్మన మిఠాయి పొట్లం చేతికందింది

నారి చేతికందింది

హాయి హాయి హయి హయి హయి బుల్లెమ్మా

కులాసపాటల చలాకి తుమ్మెద గూటికి చేరింది

గులాబి గూటికి చేరింది

నేనే నేనే తుమ్మెదను

నీకై మనసె చిమ్మెదను

ఓ..ఓ..య్య

అద్దిరబన్న ఓ రాజా హయిరె హయిరే నారాజా

ఓ...ఓ....య్య

వేగుచుక్కా నేనయితే వెలగపండు నీవైతే

కాళ్ళాగజ్జా నేనయితే కంకాళమ్మ నీవయితే

హే కంకాళమ్మా ...

వేగుచుక్కా నేనయితే వెలగపండు నీవైతే

కాళ్ళాగజ్జా నేనయితే కంకాళమ్మ నీవయితే

పిల్లపేరు మల్లెమొగ్గ తానే అవుతుంది

హాయ్ నాపేరు జమిందారు కాకేమవుతుంది.

Tuesday, July 26, 2011

ఐనదేమో ఐనది..చిత్రం : జగదేకవీరుని కథ (1961)

ఆ....

ఆ...

ఆ..

ఆ...

ఐనదేమో ఐనది ప్రియగానమేదే ప్రేయసీ

ఐనదేమో ఐనది ..

ఆ..

ప్రేమగానము సాగగానే భూమి స్వర్గమే ఐనది

భూమి స్వర్గమే ఐనది


ఏమి మంత్రము వేసినావో ఏమి మత్తును చల్లినావో

ఆ..ఆ..ఆ..

నిన్ను చూసిన నిమిషమందే మనసు నీ వశమైనది../2/

మనసు నీ వశమైనది.

ఐనదేమో ఐనది..

కులుకులొలికే హొయలు చూసి వలపుచిలికే లయలు చూసి



కులుకులొలికే హొయలు చూసి వలపుచిలికే లయలు చూసి


తలపులేవో రేగి నాలో చాల కలవరమైనది.

చాల కలవరమైనది

ఐనదెమో..//

Saturday, July 23, 2011

ఏ శుభ సమయంలో ,,,చిత్రం: మనసు మాంగల్యం (1971)

ఏ శుభ సమయంలో

ఈ కవి హృదయంలో

నీ కాలి అందెలు మ్రోగినవొ

ఎన్నెన్ని ఆశలు పొంగినవో

ఏ శుభసమయంలో

ఈ చెలి హృదయంలో

నీ ప్రేమగీతం పలికిందో

ఎన్నెన్ని మమతలు చిలికిందో

అహ్హా.......అహా

అహా ,,,,,,,అహా

ఆహాహాహాహాహ

కలలో నీవె ఊర్వశివే ఇలలో నీవే ప్రేయసివే ../2/

ఆ ..నీడేలేని నాకోసంతోడైఉన్న దేవుడివే../2/

చిక్కని చీకటిలోన అతి చక్కని జాబిలివే

ఏ శుభసమయంలో


మనిషై నన్ను దాచావు కవివై మనసు దొచావు

నిన్నే గెలుచుకున్నాను నన్నే తెలుసుకున్నాను

పందిరినోచనిలతకు నవ నందనమైతివి నీవే

ఏ శుభసమయంలో..

నీ ప్రేమగీతం పలికిందో

ఎన్నెన్ని మమతలు చిలికిందో

అహ్హా.......అహా

అహా ,,,,,,,అహా

ఆహాహాహాహాహ





ఏమివ్వను నీకేమివ్వను.... చిత్రం :సుపుత్రుడు (1971)

ఏమివ్వను నీకేమివ్వను

నా మనసే నీదైతే ఏ మివ్వను

నన్నే వలచి నా మేలు తలచి //2//

లేని కళంకం మోసిన ఓ చెలీ

మచ్చలేని జాబిలీ

ఏమివ్వను నీకేమివ్వను

నా మనసే నీదైతే ఏ మివ్వను..


తారకలే కోరికలై మెరియగా

కనులు విరియగా

వెన్నెలలే వేణువులై పలుకగా

మధువు లొలకగా

యుగయుగాలు నిన్నే వరియించనా

నా సగము మేన నిన్నే దరియించనా

ఏమివ్వను నీకేమివ్వను

నా మనసే నీదైతే ఏ మివ్వను


ఏమడగను ఇంకేమడగను

నీ మనసే నాదైతే ఏమడుగను

నీ కన్నుల వెలుగులేతారకలై నయన తారకలై

నీ నవ్వులజిలుగులేచంద్రికలై కార్తీక చంద్రికలై

జగమంతా నీవే అగుపించగా

నీ సగము మేన నేనె నివసించగా

ఏమడగను ఇంకేమడగను

నీ మనసే నాదైతే ఏమడుగను

నిన్నేవలచి నీ మేలు తలచి..//2//

బ్రతుకేనీవైపరశించు చెలిని నీ జాబిలిని

ఏమడగను ఇంకేమడగను

నీ మనసే నాదైతే ఏమడుగను


ఆహాహా ఆహాహా హహహ

ఊహుహు ఊహుహుహు

Monday, July 18, 2011

ఎందాక ఎందాక ఎందాక...చిత్రం :చిరంజీవులు (1956)

ఎందాక ఎందాక ఎందాక...

అందాక అందాక అందాక

ఎందాక ఎందాక ఎందాక...

అందాక అందాక అందాక


ఈ ఉరుకేమిటి ఈ పరుగేమిటి

ఈ ఉరుకేమిటి ఈ పరుగేమిటి

ఓ హేయ్ ఎందాక ఎందాక ఎందాక...

అందాక అందాక అందాక

చివ్వున పోయి రివ్వున వాలి

చిలుకని సింగారించాలి

ఓ చిలుకని సింగారించాలి

పువ్వులతోనా

ఆహా...రవ్వలతోనే

హ..ఆ..హ

మానాన్న కోడలు బంగారు బొమ్మ //2//

ఓ హేయ్ ఎందాక ఎందాక ఎందాక...

అయితే గియితె అమ్మయి ఎవరో

ఆడేపాడే అందాలబాలా

అయితేనువ్వో

నేతిమిఠాయి

హా..

ఆ హహా

పక్కింటి అబ్బాయి బంగారు తండ్రి

ఓ హేయ్ ఎందాక ఎందాక ఎందాక...

హేయ్..

ఎందాక ఎందాక ఎందాక...

అందాక అందాక అందాక

కన్నులనిండా కలకలలే

కన్నెకు సొమ్ముగ తేవాలి

నవకాలోలికే నీ చిరునవ్వే...//2//

తిలకపు సింగారం కావాలి

కావాలి కావాలి కావాలి

పరుగున రావాలి

రావాలి రావాలి రావాలి ,,,

Sunday, July 17, 2011

ఎంత ఘాటు ప్రేమయో...చిత్రం : పాతాళభైరవి (1951)

ఎంత ఘాటు ప్రేమయో ఎంత తీవ్రవీక్షణమో ఓ

ఎంత ఘాటు ప్రేమయో

కన్నుకాటు తిన్నదిగా కళలు విరిసెనే నా

మనసు మురిసేనే నా మనసు మురిసేనే ..

ఎంత ఘాటు ప్రేమయో ..


ఎంత లేత వలపులో.ఎంత చాటు మోహములో..ఓ

ఎంతలేతవలపులో

కన్నులలో కనినంతనే తెలిసిపోయెనే

నా మనసు నిలిచేనే..నా ..మనసు నిలిచేనే

ఎంత లేత వలపులో ..


ఈ జాబిలి ఈ వెన్నెల ఈ మలయానిలమూ ..//2//

విరహములొ వివారాలను విప్పి చెప్పెనే

ఎంత ఘాటు ప్రెమయో..


ఓ జాబిలి ఓ వెన్నెల ఓ మలయానిలమా..//2//

ప్రియురాలికి విరహాగ్ని ని పెంపుజేయవే..

ఎంత ఘాటు ప్రేమయో..

Saturday, July 16, 2011

ఆనందమాయె అలినీలవేణీ ..చిత్రం ;;చెంచులక్ష్మి (1958)

ఆనందమాయె అలినీలవేణీ ఆనందమాయె అలినీలవేణీ

అరుదెంచినావా అందాలదేవీ

ఆనందమాయె అలినీలవేణీ

ఆ ...........


అనువైన వేళా అనురాగ శోభా

అది ప్రెమ పూజా ,నా భాగ్యమాయె

ఆ.............

అలనాటి నోము కలనేడు పండే

అరుదైనా హాయి నా లోన నిండే

ఆనందమాయే అసమాన తేజా

అపురూపమైనా అందాల దేవా

అనందమాయె అసమాన తేజా


ఆ .........

సొగసైన రూపేసోలించు చూపే

సగమైన కనులా సంతొష నిధులే

ఆ ....

నగుమోము పైనా నడయాడు కళలే

అగుపించగానే మధువరు నాలో

ఆనందమాయె అలినీలవేణీ..//

ఆ...

ఎనలేని స్వామి నిను చేరపోతే

నునులేత ప్రేమా నను సాగనీదే

ఆ....

తనువేమో నీకై తపియించు నిలచి

మనసేమోనీలో మునుపే కలసి

ఆనందమాయె అసమాన తేజా....//

ఆనందమాయె అలినీలవేణీ..///

ఆ ...

Friday, December 31, 2010

Monday, November 8, 2010

అడవే అడవే జలకమ్ములాట ....చిత్రం: విచిత్ర కుటుంబం (1069)

ఆడవే..ఆడవే ..
ఆడవే జలకమ్ములాడవే //2//
కలహంస లాగ జలకన్య లాగ //2//
ఆడవే......ఆడవే
ఆదికవి నన్నయ్య అవతరించిన నేల
ఆ..ఆ..ఆ...
తెలుగుభారతి అందియలు పల్కె ఈ నేల ..
ఆంధ్ర సంస్కృతికి తీయని క్షీరధారలై
జీవకళలొల్కు గోదావరి తరంగాల ఆడవే..ఆడవే
నాగార్జునుని భోధనలు ఫలించిన చోట
ఆ..ఆ..ఆ..
బౌద్దమత వృక్షంబు పల్లవించిన చోట
బుద్దం శరణం గచ్చామి ..
ధర్మంశరణం గచ్చామి
సంఘం శరణం గచ్చామి

కృష్ణవేణి తరంగిణి జాలిగుండెయె సాగరమ్మై
రూపు సవరించుకొను నీట
ఆడవే ... ఆడవే
కత్తులును ఘంటములు కదను త్రొక్కినవిచట //2//
అంగళ్ళ రతనాలు అమ్మినారట యిచట
నాటి రాయల పేరు నేటికిని తలపోయు
తుంగభద్రానదీ తోయ మాలికలందు
ఆడవే ...ఆడవే..


http://www.chimatamusic.com/playcmd.php?plist=8801