Friday, April 24, 2015

1950 hits

As I was away from my home town for a long time I could not post much .
I will try my best to bring some beautiful  songs 

Monday, December 30, 2013




2013 చివారాఖరి దశ లో కొచ్చాం ఇలా వచ్చి అలా మాయమైపోతున్నాయి ఈ సంవత్సరాలు. ఒక్క వయసు పెరగడం తప్ప గొప్పగా సాధించిందేమీ లేదు . ప్రతిఏడు చివర అలా వెనక్కి వెళ్ళి రావటం అలవాటు.ఇక నా జీవితానికి మార్పులు చేర్పులు అనవసరమైనా అనుభవాన్ని పంచితేనే చరిత్రవుతుంది .

       సరిగ్గా 50 ఏళ్ళక్రితం పరిస్థితి  ఎలా ఉండేదో చూడండి  అప్పుడు
ఇడ్లి 2 = 0.05 పైసలు
దొశ 1 = 0.10 పైసలు
మలకపేట కాలనీ నుంచి కోఠీ  = 0.07 పైసలు
రిక్షా ఎక్కితె 0.25 పైసలు
సిగెరెట్టు - 0.03 పైసలు రెండు కొంటే 0.05 పైసలు.
పెట్రోలు = 0.67 పైసలు
బంగారం = 63.00 రూపాయలు
సినిమా నేలటికెట్టు 0.19 పైసలు

ఇవి చూసి మేమేదో ఆనందం పొందామనుకుంటే పొరపాటే. ఇప్పటి జీతాలతో మీరు పొందే మనస్థితే అప్పటి జీతాలతో మేం పొందింది. ఇప్పుడు అనుకోటానికి మాత్రం కైలాస శిఖరాలు ఎక్కినంత తృప్తి .

ఇక రాబోయే కాలాలు ఎలాఉంటాయో ఏమో .. అప్పటి తరం వాళ్ళకు ఈ జీవితాలే గొప్ప ఆనందాని ఇస్తాయేమో .....
    

Saturday, August 10, 2013

పిచ్చుకలు ( house sparrow )

ఈ పక్షి ని ఎపుడైనా చూసారా .ఈ నాటి కుర్రకారు చూసి ఉండకపోవచ్చు అవునా .. ఇవే ఊరు పిచ్చుకలు , గువ్వలని అంటారు .ఇంగ్లీషు లో స్పారో ..మా బాల్యం లో ఇవి ప్రతి ఇంటా తిరిగే గువ్వలు .ఇంటి చూరులోనో ఫేన్ కప్పులోనో గూళ్ళూకట్టుకుని నివసించేవి
అప్పట్లో పిల్లలు వీటిని చూసే ఆనందించేవారు.రోజు ఇంట్లో మనుషుల వలే తిరుగుతూ ,ఎగురుతూ ఉండేవి ..
నాగరికత పెరిగింది వీటి సంతతి తరిగింది..ఇప్పుడు ఎక్కడో పల్లెల్లో మాత్రం కోతలప్పుడు కనపడుతుంటాయి ...నిత్య జీవితంలో సదా పాలుపంచుకునే ఓ జాతి కనుమరుగైందనే బాధ ..


Friday, July 26, 2013

plant art at botanical garden montreal (canada )

అందరం తోటల్లో విహరించాలనే అనుకుంటాం ..మరి ఇలాంటి తోట చూడాలని అనిపిస్తోందా.. ఇక్కడ విహారం ఎంత ఉల్లాసమో కదా...
ఇది మాంట్రియల్ (కెనడా) లో బొటానికల్ గార్డన్స్ ..సందర్శన కొన్ని నెలలు మాత్రమే...


Add caption








Monday, May 6, 2013



చూసారుగా  తిరుపతి లో మేఘాల హడవుడి  .. స్వామి ని చల్లపరచాలని  తపన ....  

Tuesday, December 11, 2012

హమ్మయ్య  వర్షాలు బాగానే పడ్డాయి. కరెంటు కోతలు తగ్గాయి.
ఇక కాసేపు నా బ్లాగు బాగోగులు చూసుకోవాలి. మరి చాలా ఆలస్యం అయ్యింది కదా
ముందు కొన్ని తిరుపతిఫోటోలు పెడతాను.





Friday, September 16, 2011

కోడెకారూ చిన్నవాడా....ముందడుగు (1958 )




కోడెకారు చిన్నవాడా వాడిపోని వన్నెకాడా

కోటలోనా పాగావేసావా చల్ పూవులరంగా

మాటతోనే మనసు దోచావా


చింతపూల రైకదానా చిలిపి చూపుల చిన్నదానా

కోరికలతో కోటే కట్టావా చల్ నవ్వుల రాణి

దోరవలపుల దోచుకున్నావా


చెట్టుమీద పిట్ట ఉంది పిట్ట నోట పిలుపు ఉంది

పిలుపు ఎవరికో తెలుసుకున్నావా

చల్ పూవుల రంగా తెలుసుకుంటే కలిసి ఉంటావా


పిలుపు విన్నా తెలుసుకున్నా

పిల్లదానా నమ్ముకున్నా

తెప్పలాగా తేలుతున్నానే

చల్ నవ్వుల రాణి .. నాకు జోడుగా నావ నడిపేవా

చల్ నవ్వుల రాణి .. నాకు జోడుగా నావ నడిపేవా

కోడెకారూ....


నేలవదిలి నీరు వదిలి నేను నువ్వను తలపు మాని

ఇద్దరొకటై ఎగిరిపోదామా

చల్ పూవులరంగా గాలి దారుల తేలి పోదామా


ఆడదాని మాటవింటే తేలిపోవటం తేలికంటే

తెల్సి తెల్సి ముంచుతారంట

చల్ నవ్వులరాణీ మునుగుతుంటే నవ్వుతారంట..

చల్ నవ్వులరాణీ మునుగుతుంటే నవ్వుతారంట..

కోడెకారూ...


Wednesday, August 24, 2011

ఆడదాని ఓరచూపుతో .....ఆరాధన (1962 )

ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వరోయ్

నిజానికి జిగేలని వయారి నిన్నుచూడ కరిగిపోదువోయ్


మిఠారి నవ్వులే మిఠాయి తీపులు

కటారి రూపులోన కైపులున్నవి

రంగేళిఆటకు రడీగా ఉన్నది

రంగేళి ఆటకు రడీగా ఉన్నది

కంగారు ఎందుకోయీ .....//


ఖరీదు లేనివి ఖరారు అయినవి

గులాబి బుగ్గలందు సిగ్గులున్నవి

ఖరీదు లేనివి ఖరారు అయినవి

గులాబి బుగ్గలందు సిగ్గులున్నవి

మజాల సొగసులే ప్రజెంట్ చేసెద

మజాల సొగసులే ప్రజెంట్ చేసెద

సుఖాల తేలవొయీ....///