Wednesday, August 24, 2011

ఆడదాని ఓరచూపుతో .....ఆరాధన (1962 )

ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వరోయ్

నిజానికి జిగేలని వయారి నిన్నుచూడ కరిగిపోదువోయ్


మిఠారి నవ్వులే మిఠాయి తీపులు

కటారి రూపులోన కైపులున్నవి

రంగేళిఆటకు రడీగా ఉన్నది

రంగేళి ఆటకు రడీగా ఉన్నది

కంగారు ఎందుకోయీ .....//


ఖరీదు లేనివి ఖరారు అయినవి

గులాబి బుగ్గలందు సిగ్గులున్నవి

ఖరీదు లేనివి ఖరారు అయినవి

గులాబి బుగ్గలందు సిగ్గులున్నవి

మజాల సొగసులే ప్రజెంట్ చేసెద

మజాల సొగసులే ప్రజెంట్ చేసెద

సుఖాల తేలవొయీ....///

Friday, August 5, 2011

ఒకటే హ్రదయం కోసము ...చిత్రం : చదువుకున్న అమ్మాయిలు (1963)

గుట్టుగా లేతరెమ్మల కులుకు నిన్ను

రొట్టెముక్కల మధ్యన పెట్టిరనుచూ

ఏల ఇట్టుల చింతింతువే ..టొమాటో

అతివలిద్దరి మధ్య నా గతికనుమా...ఆ..


ఒకటే హృదయం కోసము

ఇరువురి పోటీ దోషము ../2/

ఒకటే హృదయం కోసము


ఒకరు సత్యభామ

ఒకరేమో రుక్మిణి

మధ్యనలిగినాడు మాధవుందు

ఇద్దరతివలున్న ఇరకాటమెనయా

విశ్వధాభిరామ వినురవేమా..

ఆ...ఆ..ఆ...ఓఓ..ఓఓ..ఓఓ


జతగా చెలిమి చేసిరి

అతిగా కరుణే చూపిరి

అహ హ..అహహ..ఆహహా..

చెలిమే వలపై మారితే

శివశివ మనపని ఆఖరే..

ఆ.....//ఒకటే//

ఆ..ఆ..ఆ..ఒ..ఒ..ఓ...


రామునిదొకటే బాణము

జానకి ఆతని ప్రాణము

అహహ..అహహ..

ప్రేమకు అదియే నియమము

ప్రేయసి ఒకరే న్యాయము..

ఆ...

//ఒకటే..//