Friday, December 31, 2010

Monday, November 8, 2010

అడవే అడవే జలకమ్ములాట ....చిత్రం: విచిత్ర కుటుంబం (1069)

ఆడవే..ఆడవే ..
ఆడవే జలకమ్ములాడవే //2//
కలహంస లాగ జలకన్య లాగ //2//
ఆడవే......ఆడవే
ఆదికవి నన్నయ్య అవతరించిన నేల
ఆ..ఆ..ఆ...
తెలుగుభారతి అందియలు పల్కె ఈ నేల ..
ఆంధ్ర సంస్కృతికి తీయని క్షీరధారలై
జీవకళలొల్కు గోదావరి తరంగాల ఆడవే..ఆడవే
నాగార్జునుని భోధనలు ఫలించిన చోట
ఆ..ఆ..ఆ..
బౌద్దమత వృక్షంబు పల్లవించిన చోట
బుద్దం శరణం గచ్చామి ..
ధర్మంశరణం గచ్చామి
సంఘం శరణం గచ్చామి

కృష్ణవేణి తరంగిణి జాలిగుండెయె సాగరమ్మై
రూపు సవరించుకొను నీట
ఆడవే ... ఆడవే
కత్తులును ఘంటములు కదను త్రొక్కినవిచట //2//
అంగళ్ళ రతనాలు అమ్మినారట యిచట
నాటి రాయల పేరు నేటికిని తలపోయు
తుంగభద్రానదీ తోయ మాలికలందు
ఆడవే ...ఆడవే..


http://www.chimatamusic.com/playcmd.php?plist=8801

Sunday, November 7, 2010

ఎంత మంచి వాడవురా ..చిత్రం :నమ్మినబంటు (1960)

ఎంత మంచి వాడవురా ..

ఎన్ని నోళ్ళ పొగడుదురా

ఎంత మంచి వాడవురా ..

ఎన్ని నోళ్ళ పొగడుదురా

ఎటుల నిన్ను వీడుదురా ..//2//

ఎంతమంచి//


ఎంత మంచిదానవే
పొరపాటు గ్రహించితివే

ఎంత మంచిదానవే

పొరపాటు గ్రహించితివే

నా ప్రేమ హరించితివే //2//

ఎంత మంచిదానవే

పొరపాటు గ్రహించితివే


ఆ...

మనసులోన కోవెలగట్టి

మల్లెపూల అంజలిబట్టి ..//2//

నిను నిత్యము పూజింతునురా ..

నీ కథలే స్మరియింతునురా ..//ఎంత మంచి //


ఆ....


నీ పూజా సుమములు బెట్టి

రకరకాల దండలు గట్టి

నీ మెడలో వేసెదనే

నాదానిగ జేసేదనే //ఎంత మంచి //

కలలే నిజమాయెనులే

జీవితమే మారెనులే

ఇద్దరము చూపులు కలిపి

ఏకంగా పోదములే ..//ఇద్ద్దరము //

ఆ....





Saturday, November 6, 2010

ఎవరో జ్వాలను రగిలించారు ..చిత్రం : డా.చక్రవర్తి (1964)

ఎవరో జ్వాలను రగిలించారు

వేరెవరో దానికి బలియైనారు

ఎవరో జ్వాలను రగిలించారు

వేరెవరో దానికి బలియైనారు


అడుగు అడుగున అపజయములతో

అలసి సొలసిన నా హ్రుదయానికి

సుధవై ...సుధవై జీవన సుధవై

ఉపశానితి నివ్వగా ఓర్వని వారలు

ఎవరో జ్వాలను రగిలించారు

వేరెవరో దానికి బలియైనారు


అనురాగానికి ప్రతిరూపాలై

ఆదిదంపతులవలె మీరుంటే

ఆనందంతో మురిసానే

ఆత్మీయులుగా తలిచా...నే

అందుకు ఫలితం అపనిందేనా ..//ఎవరో //


మనిషికి మనిషికి మమత కూడదా

మనసు తెలుసుకొను మనసే లేదా

ఇది తీరని శాపం

ఇది మారని లోకం

మానవుడే దానవుడై మసలే చీకటి లోకం

ఎవరో జ్వాలను రగిలించారు

వేరెవరో దానికి బలియైనారు

Sunday, October 31, 2010

ఎవరన్నారివి కన్నులని..చిత్రం: దొరికితే దొంగలు (1965 )

ఎవరన్నారివి కన్నులని
అరెరె మధువొలొకే గిన్నెలవి
ఎవరన్నారివి బుగ్గలని
హోయ్ ఎర్రని రోజా మొగ్గలవి
ఎవరన్నారివి కన్నులని ....
నడుమిది ఏమంటున్నది
ఈ నడుమిది ఏమంటున్నది
నా పిడికిట ఇమడెదనన్నది
నల్లని జడ ఏమన్నది
నా నల్లని జడ ఏమన్నది
అది నను బంధించెద నన్నది
నను బంధించెదనన్నది
//ఎవరన్నారివి //
సిగ్గులు దోసిట దూయకు
నా సిగ్గులు దోసిటదూయకు
నీ చేతుల బందీ చేయకు //2//
మెల్లగ లోలో నవ్వకు
మెలమెల్లగ లోలో నవ్వకు
చలచల్లగ పిడుగులు రువ్వకు
చల్లగ పిడుగులు రువ్వకు
// ఎవరన్నారివి కన్నులని //

అడుగున అడుగిడుటెందుకు
నా అడుగున అడుగిడుటెందుకు
నువు తడబడి పోతున్నందుకు
మరి మరి చూచెదవెందుకు
నను మరి మరి చూచెదవెందుకు
నువు మైకం లో ఉన్నందుకు
మైకంలో ఉన్నందుకు
//ఎవరన్నారివి కన్నులని
//
http://www.youtube.com/watch?v=8aexvAZLgok

Saturday, October 30, 2010

ఎవరు నీవు నీ రూపమేది ..చిత్రం : ప్రేమలు పెళ్ళిళ్ళు (1974)

ఎవరు నీవు నీ రూపమేదీ ..ఏమని పిలిచేదీ
నిన్నేమని పిలిచేదీ
నేనని వేరే లేనేలేనని ఎలా తెలిపేదీ
మీ కెలా తెలిపేదీ..

నిదుర పోయిన మనసును లేపి
మనిషిని చేసిన మమతవు నీవో
నిదురేరాని కనులను కమ్మని
కలలతో నింపిన కరుణవు నీవో
పూ జకు తెచ్చిన పూవును నేను
సేవకు వచ్చిన చెలిమిని నేను
పసివాడే ఆ పసిపాపలకై
దేవుడు పంపిన దాసిని నేను

//నేనని వేరే //
చేదుగ మారిన జీవిత మందున
తీపిన చూపిన తేనెవు నీవు
వడాగాడ్పులలో వడలిన తీగకు
చిగురులు తొడిగిన చినుకే మీరు
చిగురు తొడిగిన చినుకే మీరు...
కోరిక లేకా కోవెలలోన
వెలుగై కరిగే దీపం నీవు
దీపం లోని తాపం తెలిసి
ధన్యను చేసే దైవం మీరు
దైవం మీరు..
అహా హా అహా హా..



http://www.chimatamusic.com/playcmd.php

Friday, October 29, 2010

ఎచటికోయి నీ పయనం ..చిత్రం : అమర శిల్పి జక్కన (1964)

ఎచటికోయీ నీ పయనం
ఏమిటోయి ఈ వైనం
ఏలనోయి ఈ ఘోరం
ఎవరిపైన నీ వైరం

మధురమైన జీవితాల కథ ఇంతేనా
ప్రేమికులకు విధి యొసగిన వరమింతేనా
మధురమైన జీవితాల కథ ఇంతేనా

నిను నమ్మిన నీ సతినే నమ్మలేక పోయావా
శిలలను కరిగించు నీ వు శిలవే అయి పోయావా
మధుర మైన జీవితాల కథ ఇంతేనా

వెన్నలతో విందు చేయు పున్నమి చంద్రుడవు నీవు
కళలు మాసి కాంతి బాసి గ్రహణం పాలైనావా
మధురమైన జీవితాల కథ ఇంతేనా

విరబూసిన చెట్టులాగ మురిసిపోవు నీ బ్రతుకే
వాడి మాడి మోడుబారి వన్నె మాసి పోయిందా
ఎచటి కోయి నీ పయనం
ఏమిటోయి ఈ వైనం
ఏలనోయి ఈ ఘోరం
ఎవరి పైన నీ వైరం.

Thursday, October 28, 2010

ఎక్కడి దొంగలు అక్కడనే గప్ చుప్ ..చిత్రం : ఇల్లరికం (1959 )

ఎక్కడి దొంగలు అక్కడనే గప్ చుప్
ఎవరే పిలిచారు నిన్నెవరే పిలిచారు
ఎక్కది దొంగలు అక్కడనే గప్ చుప్ //ఎవరె //

చాటుగా కనుచాటుగా చూడకే ఇటు చూడకె
పొదలలో పూపొదలలో పొంచినా గాలించినా //2//
కనులకు నే కనిపించనులే.. //ఎక్కడి //

నీడలో దోబూచిగా ఆడకే తారాడాకే
నీటిలో కోనేటిలో చూడకే వెదుకాడకే ..//2//
దాగుడు మూతలు చాలునులే ... // ఎక్కడి //

వెదికినా నే దొరకనే పిలిచినా నే పలుకనే
హృదయమే నా కొసగినా ఎదుటనే కనిపింతునే.. //2//
ఎన్నటికీ నిను వీడనులే ... //ఎక్కడి //

Tuesday, October 26, 2010

ఈ వెన్నెల ..జ జ జ ..చిత్రం శభాష్ సూరి (1964)

ఈ వెన్నెల
జ జ జ
ఈ పున్నమి వెన్నెల
జ జ జ
ఈ నాడూ ఆ నాడూ ఒకే వెన్నెల ..ఆ...ఆ..
ఈ వెన్నెల
జ జ జ
ఈ పున్నమి వెన్నెల
జ జ జ
ఈ నాడూ ఆ నాడూ ఒకే వెన్నెల ..ఆ...ఆ..
వలపుల వెన్నెల...
జ జ జ
జతకలిపే వెన్నెల ...
జ జ జ
వలపుల వెన్నెల...
జ జ జ
జతకలిపే వెన్నెల ...
జ జ జ
అల్లరి వెన్నెల ..కలలల్లే వెన్నెల
ఆ..ఆ..ఆ..ఆ

//ఈ వెన్నెల //


లైలా నవ్వుల చల్లదనం
మజ్ఞు మమతల వెచ్చదనం
లైల నవ్వుల చల్ల్దనం
లై- లా - న - వ్వు - ల - చ - ల్ల - ద - నం
మజ్ఞు మమతల వెచ్చదనం
మ - జ్ఞు - మ - మ - త - ల - వె - చ్చ - ద - నం
తార కోర్కెలో దుడుకుతనం
కలబోసిన కమ్మని వెన్నెల ..ఆ..ఆ..ఆ
//ఈ వెన్నెల //

ఒంటరి వాళు ఓపనిదీ
జంటకు చాలీ చాలనిదీ
ఒంటరి వాళు ఓపనిదీ
ఒం ట రి వా ళు ఓ ప ని దీ
జంటకు చాలీ చాలనిదీ
జం ట కు చా లీ చా ల ని దీ
చెలి కన్నులలో వెలిగేదీ
చిలిపి పనులు చేయించేది ఈ..ఈ..ఈ

ఈ వెన్నెల
జ జ జ
ఈ పున్నమి వెన్నెల
జ జ జ
ఈ నాడూ ఆ నాడూ ఒకే వెన్నెల ..ఆ...ఆ..


http://www.chimatamusic.com/playcmd.php

Sunday, October 24, 2010

ఈ పాట నీ కోసమే హొయ్ ..చిత్రం : నిర్దోషి (1970)

ఈ పాట నీ కోసమే హోయ్
ఈ ఆట నీ కోసమే..
ఈ పాట నీ కోసమే హోయ్
ఈ ఆట నీ కోసమే..
ఈ పూలు పూచేది ఈ గాలి వీచేది
మనసైన మన కొసమే
ఓయి ఈ పాట ......//

పగలయిన రేయైన నీ ధ్యానమే
నిలువెల్ల రగిలించు నీ మౌనమే
అహహ ఒహొహొ ఓహొహో
పగలయిన రేయైన నీ ధ్యానమే
నిలువెల్ల రగిలించు నీ మౌనమే
నీ చూపు నా పాలి సుమబాణమే //2//
నిను చూడ కదలాడు నా ప్రాణమే
ఈ పాట నీకోసమే ...............

నీ గుండెలో నేను దాగుంటిని
నీ గారడీలన్ని కనుగొంటిని
అహహ ఒహొహొ ఓహొహో
నీ గుండెలో నేను దాగుంటిని
నీ గారడీలన్ని కనుగొంటిని
నీ కళ్ళ వెనకాల నేనుంటిని //2//
కనరాని వలయాలు కనుగొంటిని

ఈ పాట నీ కోసమే హోయ్
ఈ ఆట నీ కోసమే..

Saturday, October 23, 2010

ఊయలలూగే నాహృదయం .. చిత్రం : అభిమానం (1960 )


ఊయలలూగే నాహృదయం
తీయని పాటా పాడేనే

ఊయలలూగే నాహృదయం
తీయని పాటా పాడేనే
తీవెలతో సరాగాల తేలి
పూవులతో సయ్యాటాడే గాలి //2//
ఎలమావి చేరి చివురాకు మేసి
కోయిల అనువుగ కూసేనే //2//
ఊయలలూగే నాహృదయం
తీయని పాటా పాడేనే

రాగసుధా తరంగాల డోలా
వేడుకలా విహారాల వేళా //2//
చిన్నారి చెలియ విన్నానె మరయ
నా మది పరవశ మాయేనే //2//
ఊయలలూగే నాహృదయం
తీయని పాటా పాడేనేతీయని పాటా పాడేనే

ఊయలలూగే నాహృదయం
తీయని పాటా పాడేనే
తీవెలతో సరాగాల తేలి
పూవులతో సయ్యాటాడే గాలి //2//
ఎలమావి చేరి చివురాకు మేసి
కోయిల అనువుగ కూసేనే //2//
ఊయలలూగే నాహృదయం
తీయని పాటా పాడేనే

రాగసుధా తరంగాల డోలా
వేడుకలా విహారాల వేళా //2//
చిన్నారి చెలియ విన్నానె మరయ
నా మది పరవశ మాయేనే //2//
ఊయలలూగే నాహృదయం
తీయని పాటా పాడేనే

Friday, October 22, 2010

ఊరు మారినా ఉనికి మారునా ..చిత్రం: మూగనోము (1969)

ఊరు మారినా ఉనికి మారునా
మనిషి దాగినా మమత దాగునా
మరలి రాని పయనంలో మజిలీ లేదు
ఆడదాని కన్నీటికి అంతే లేదు

అనురాగ దీపం అసమాన త్యాగం
స్త్రీ జాతి కొరకే సృజియించె దైవం
చిరునవ్వులన్ని పెదవారి పరవారి కొసగి
చీకటుల లోనే జీవించు యువతి
తలపులే వీడవు వీడేది మనిషే
వలపులే వాడవు
వాడేది తనువే ..

మగవాని కేమో ఒకనాటి సుఖము
కులకాంత కదియే కలకాల ధనము
తనవాడు వీడ అపవాదు తోడ
పదినెలల మోత చురకత్తి కోత
సతులకే ఎందుకూ ఈ ఘోరశిక్ష
సహనమే స్త్రీలకు శ్రీ రామరక్ష

ఊరు మారినా ఉనికి మారునా
మనిషి దాగినా మమత దాగునా

Thursday, October 21, 2010

ఈ ముసిముసి నవ్వుల విరిసిన పువ్వులు : చిత్రం : ఇద్దరు మిత్రులు (1961 )

ఈ ముసిముసి నవ్వుల విరిసిన పువ్వులు
గుసగుస లాడినవి ఏమిటో
విరజాజి గులాబి మనగుట్టే తెలుసుకున్నవి
చామంతి పూబంతి పరిహాసాలాడినవి
విరజాజి గులాబి మనగుట్టే తెలుసుకున్నవి
చామంతి పూబంతి పరిహాసాలాడినవి
ఈ ముసిముసినవ్వుల విరిసిన పువ్వులు
గుసగుసలాడినవి ఏమిటో
ఆఆఆఆఆఆఆఆ
అహా
ఓఓఓఓఓఓఓఓ
ఊహూ
పొదరింటను ఒంటరి పావురము
తన జంటను కలియగ వేచినది
మనసే తెలిసి తన ప్రేయసికై
మగపావురమే దరి జేరింది
ఆ............
//ఈ ముసి ముసి //
ఆఆఆఆఆఆఆఆ
అహా
ఓఓఓఓఓఓఓఓ
ఊహూ
నీ కురులను రేపిన చిరుగాలి
నా మదిలో కోరిక రేపినది
వలపే తెలిపే కనుసైగలతో
నీ ఊసులు బాసలు చేసాయి
ఆ............
//ఈ ముసి ముసి //
నదిలో మెరసి కదిలే కాంతి //2//
నా మోమున తళతళలాడింది
నీ చక్కని చెక్కిలి అద్దానా
నా రూపము నేను చూసాను
ఆ...
//ఈ ముసి ముసి //
ఆ...ఆ..ఆ..

Wednesday, October 20, 2010

ఈ పగలు రేయిగా పండు వెన్నెలగ ..చిత్రం : సిరిసంపదలు (1962)

ఈ పగలు రేయిగా పండు వెన్నెలగ మారినదేమి చెలీ
ఆ కారణమేమి చెలీ
అ ...
ఊ ....
వింత కాదు నా చెంత నున్నది
వెండి వెన్నెల జాబిల్ నిండు పున్నమి జాబిలి
ఓ ...
మనసున తొణికే చిరునవ్వెందుకు పెదవుల మీదికి రానీవు
అహ్హ ..ఒహో ..ఆహా..ఆ
మనసున తొణికే చిరునవ్వెందుకు పెదవుల మీదికి రానీవు
పెదవి కదిపితే మదిలో మెదిలే మాట తెలియునని మానేవు
ఊ ... ....// వెండి //

కన్నులు తెలిపే కథలనెందుకు రెప్పలార్చియే మార్చేవు
అహ్హ ..ఒహో ..ఆహా..ఆ

కన్నులు తెలిపే కథలనెందుకు రెప్పలార్చియే మార్చేవు
చెంపలు పూచే కెంపులు నాతో నిజము తెలుపునని దడిసేవు
ఓ హోహో
//వెండి //
అలుక చూపి అటువైపు తిరిగితే అగుపడదనుకుని నవ్వేవు
ఉహ్హూ హ్హూ
అలుక చూపి అటువైపు తిరిగితే అగుపడదనుకుని నవ్వేవు
నల్లని జడలో మల్లెపూలు నీ నవ్వులకర్థం చూపేను
అహ ...
// వెండి ..//

Tuesday, October 19, 2010

ఈడు జోడుగా తోడు నీడగా ..చిత్ర్రం:: దొంగల్లో దొర (1957)

ఓ హో ...రాణి
ఒఓ ఒ ఒ ఓ రాజా
ఓ హో.. రాణీ
ఒఓ ఒ ఒ ఓ రాజా
ఈడు జోడుగా ... తోడు నీడగా
ఈడు జోడుగా తోడు నీడగా
మనముందాములే ఈ తీరుగా
ఈడు జోడుగా ... తోడు నీడగా
అహాహా ఆ ఆఆఆ
అహాహా ..ఆ ..ఆఆఆ

రేరాజు పలుక రేరాణి కులుక , విందైనవెన్నెల చిందు వేయగా
ఈ రేయి నీవై నీ హాయి నేనై ఆ...//2//
కడలి పొంగారు సరసాల లీలగా ...//ఈడు జోడుగా //
అహాహా ఆ ఆఆఆ
అహాహా ..ఆ ..ఆఆఆ
నీ వాలు కన్నుల పరువము నేనై
నన్నేలు చిన్నారి మురిపెము నీవై
నీ వాలు కన్నుల పరువము నేనై
నన్నేలు చిన్నారి మురిపెము నీవై
నీ బాస నేనై
నా ఆశనీవై ..ఆ.
నీ బాస నేనై
నా ఆశనీవై
కలసి కలకాలము ఈ లీలగా

ఈడు జోడుగా ... తోడు నీడగా
ఈడు జోడుగా తోడు నీడగా
మనముందాములే ఈ తీరుగా
ఈడు జోడుగా ... తోడు నీడగా

ఓ హో ...రాణి
ఒఓ ఒ ఒఓ రాజా
ఓ హో.. రాణీ
ఒఓ ఒ ఒ ఓ రాజా

Saturday, October 16, 2010

మా ఇంటి దసరా బొమ్మల కొలువు ...




అందరికి దసరా శుభాకాంక్షలు


ఇదేమి లాహిరి ఇదేమి గారడీ ..చిత్రం :ఈడు జోడు

ఇదేమి లాహిరీ
ఇదేమి గారడీ
ఎడారి లోన పూలు పూచి ఇంత సందడి

ఇదేమి లాహిరీ
ఇదేమి గారడీ
ఎడారి లోన పూలు పూచి ఇంత సందడి

కోరుకున్న చిన్నదాని నవ్వూ
కోటి కోటి పరిమళాల పువ్వూ
ఆ ... చిన్ననాటి సన్నజాజి చెలికీ ..
కన్నులందు దాచుకున్న కలిమి
ఆ నాటి కూరిమీ చలువలోనే వేడిమి ..//2//
అనురాగపు మేలిమీ
ఇదేమి లాహిరీ ఇదేమి గారడీ
ఎడారి లోన పులు పూచి ఇంత సందడి
రామచిలక ప్రేమమాట పలికే
రాజహంస లాగ నడిచి కులికే
ఆ .. గోరువంక చిలుకచెంత వాలే కొసరి కొసరికన్నెమనసునేలే
కాబోయే శ్రీమతి మది నీకే బహుమతి //2//
అది ఆరని హారతి

ఇదేమి లాహిరీ
ఇదేమి గారడీ
ఎడారి లోన పులు పూచి ఇంత సందడి

Wednesday, October 13, 2010

ఇదిగో ఇదిగో ఇటు చూడు ..చిత్రం : శభాష్ రాజా (1961)

ఇదిగో ఇదిగో ఇటు చూడు
ఎవరో నిన్నే పిలిచేరు
ఇదిగో ఇదిగో ఇటు చూడు
ఎవరో నిన్నే పిలిచేరు
పరులు లేని అనువైన చోట
తెలియజేయాలి మదిలోని మాట
అహా హా హా

పరులు లేని అనువైన చోట
తెలియజేయాలి మదిలోని మాట కొమ్మ మీద కోయిలుంది
పొంచి వింటుంది నీ మాట
అయ్యయ్యయ్యో
ఇదిగో ఇదిగో ఇటు చూడు
ఎవరో నిన్నే పిలిచేరు

ఆకాశాన మేఘాల పై
ఏకమవుదాము ఈ క్షణమందే
ఆహా హాహా
ఆకాశాన మేఘాల పై
ఏకమవుదాము ఈ క్షణమందే
నేల విడిచి సాము చేయకు
కిందపడతావు రావోయి
అయ్యయ్యయ్యో // ఇదిగో //

నిన్నువిడిచి జీవించగలనా
జన్మ జన్మాల నీ దాన్ని గానా
అహ హ హ హా..
నిన్నువిడిచి జీవించగలనా
జన్మ జన్మాల నీ దాన్ని గానా
బంతి పూల బండి కడతా
వింతపయనాలు చేద్దామా
ఓయ్ ఓయ్ ఓయ్ హోయ్ ..
///ఇదిగో ///

Tuesday, October 12, 2010

ఆశ నిరాశ ను చేసితివా .... భాగ్యచక్రం (1968)

ఓహో ..ఓ..ఒ
ఓహో ఓ..ఓ..
ఆశ నిరాశను చేసితివా ,రావా చెలియా రాలేవా
రావా చెలియా రాలేవా

ఆశ నిరాశను చేసితివా ,రావా చెలియా రాలేవా
రావా చెలియా రాలేవా
తోడుగ నడిచేవనీ నా నీడగ నిలిచేవనీ
తోడుగ నడిచేవనీ నా నీడగ నిలిచేవనీ
జీవితమే ఒక స్వర్గముగ ఇక చేసెదవని నే తలచితినే
ఆశ నిరాశను చేసితివా ,రావా చెలియా రాలేవా
రావా చెలియా రాలేవా

నా ప్రాణము నీవేయని నా రాణివి నీవే అని
రాగముతో అనురాగముతో నను ఏలెదవని నే నమ్మితినే
ఆశ నిరాశను చేసితివా ,రావా చెలియా రాలేవా
రావా చెలియా రాలేవా

Saturday, October 9, 2010

అ నావ దాటి పోయింది ...చిత్రం సిపాయిచిన్నయ్య (1969)

ఓ హో ...
ఆ నావ దాటిపోయింది

ఆ ఒడ్డే చేరీ .. పొయింది
అట్లాగే మళ్ళీ పోయెనా ......
నాన్నిడిచి వెళ్ళీ ... పోయేనా
ఓ హో...
రానైనా రాలేను నిదురపోనైనా పోలేను
నిశిరాతిరి అయినా నీ పిలుపే ..నా ప్రియా
అదేపూలగాలి ఆ నాటిదే జాబిలి
ఏదీ ఎదుట మసిలీ ఏదీ లేదు నా చెలి

ఓ హో ..
నా కోసం పిలిచావో
అపుడెంత కలవరించావో .../నా కోసం //
ఆ రూపే సోకేను అదే గుండె కాల్చేను
ఇదే హోరు గాలి .. ఇదే పొంగు కడలి ..ఇదే మసక జాబిలి
ఏడీ లేడు .. నామావ .... ఏడీ లేడు
ఆహా హా ..నానావే పగిలిపోయింది
నా రేవు వేరై పోయింది
అట్లాగే మళ్ళీ పోయేనా నన్నిడిచి వెళ్ళేపోయేనా
నన్నిడిచి వెళ్ళే పోయేనా..

Friday, October 8, 2010

అన్నానా భామిని ..ఏమని ./చిత్రం: సారంగధర (1957)

అన్నానా భామిని
ఏమని
ఎపుడైనా ..ఆ..ఆ.
అన్నానా భామిని
ఏమని
అరవిరిసిన పూలలోన నీదు మురుపె మెరసెనని
ఊ..
అరవిరిసిన పూలలోన నీదు మురుపె మెరసినని
మాటవరసకెపుడైనా
అన్నానా .. భామిని .. ఎపుడైనా ..



అన్నానా మోహన
ఏమని
ఎపుడైనా ..ఆ..ఆ
అన్నాన .. మోహన .. ఏమని
తొలిచూపుల నాడె నీవు వలపు దోచుకొని నావని
అహా..
తొలిచూపుల నాడె నీవు వలపు దోచుకొని నావని
ఆదమరిచి ఎపుడైనా అన్నానా .. మోహన .. ఎపుడైనా

లోకానికి రాజునైన నీ ప్రేమకు దాసుడనని
ఊహూ ..
లోకానికి రాజునైన నీ ప్రేమకు దాసుడనని
మాటవరసకెపుడైనా
అన్నానా .. భామిని .. ఎపుడైనా



నిన్నె నమ్ముకున్నానని నీవె నా దైవమని
ఆహా..హ్హ ..హ్హ..హ్హ
నిన్నె నమ్ముకున్నానని నీవె నా దైవమని
ఆదమరిచి ఎపుడైనా అన్నానా .. మోహన .. ఎపుడైనా

అన్నానా .. మోహన .. ఎపుడైనా
ఆ ..ఆ..
want to listen ...

Thursday, October 7, 2010

ఈ వేళ నాలో ఎందుకో ఆశలు ..చిత్రం : మూగనోము(1969)

ఈ వేళ నాలొ ఎందుకో ఆశలు
లో లోన ఏవో విరిసెలే వలపులు
నీ లోని ఆశలన్నీ నా కోసమే
నాపిలుపే నీ లో వలపులై విరిసెలే ...

నీ చూపులో స్వర్గమే తొంగి చూసే
నీ మాటలో మధువులే పొంగి పోయే //2//

నా లోని ఆణువణువు నీదాయెలే
బ్రతుకంతా నీకే అంకితం చేయనా
నీ లోని ఆశలన్నీ నా కోసమే
నా పిలిపే నీ లో వలపులై విరిసెలే ..
లా ...లా... లా...లా...

నీ రూపమే గుండెలో నిండిపోయే
నా స్వప్నమే నేటితో పండిపోయే //2//

ఉయ్యాల జంపాల ఊగేనులే
కలకాలం మనకు ప్రేమయే ప్రాణము
ఈ వేళ నాలో ఎందుకో ఆశలు
లో లోన ఏవో విరిసెలే వలపులు
లా ...లా ...లా ... ఊ హూ హు..

Wednesday, August 11, 2010

Indian idol 5

its again proud moments to Andhrapradesh...
one more talent SREERAMCHANDRA
is just a step away from the title...

I wish him all the best...

vote him ...

To vote for your favourite contestant mobile users, sms to 52525 OR Call on 5052525 *Upto Rs. 3 per sms & upto Rs 6 per min.
BSNL/MTNL landline users call 18618882525 *Upto Rs. 1.20 per pulse.