Sunday, November 7, 2010

ఎంత మంచి వాడవురా ..చిత్రం :నమ్మినబంటు (1960)

ఎంత మంచి వాడవురా ..

ఎన్ని నోళ్ళ పొగడుదురా

ఎంత మంచి వాడవురా ..

ఎన్ని నోళ్ళ పొగడుదురా

ఎటుల నిన్ను వీడుదురా ..//2//

ఎంతమంచి//


ఎంత మంచిదానవే
పొరపాటు గ్రహించితివే

ఎంత మంచిదానవే

పొరపాటు గ్రహించితివే

నా ప్రేమ హరించితివే //2//

ఎంత మంచిదానవే

పొరపాటు గ్రహించితివే


ఆ...

మనసులోన కోవెలగట్టి

మల్లెపూల అంజలిబట్టి ..//2//

నిను నిత్యము పూజింతునురా ..

నీ కథలే స్మరియింతునురా ..//ఎంత మంచి //


ఆ....


నీ పూజా సుమములు బెట్టి

రకరకాల దండలు గట్టి

నీ మెడలో వేసెదనే

నాదానిగ జేసేదనే //ఎంత మంచి //

కలలే నిజమాయెనులే

జీవితమే మారెనులే

ఇద్దరము చూపులు కలిపి

ఏకంగా పోదములే ..//ఇద్ద్దరము //

ఆ....

No comments: