Saturday, August 10, 2013

పిచ్చుకలు ( house sparrow )

ఈ పక్షి ని ఎపుడైనా చూసారా .ఈ నాటి కుర్రకారు చూసి ఉండకపోవచ్చు అవునా .. ఇవే ఊరు పిచ్చుకలు , గువ్వలని అంటారు .ఇంగ్లీషు లో స్పారో ..మా బాల్యం లో ఇవి ప్రతి ఇంటా తిరిగే గువ్వలు .ఇంటి చూరులోనో ఫేన్ కప్పులోనో గూళ్ళూకట్టుకుని నివసించేవి
అప్పట్లో పిల్లలు వీటిని చూసే ఆనందించేవారు.రోజు ఇంట్లో మనుషుల వలే తిరుగుతూ ,ఎగురుతూ ఉండేవి ..
నాగరికత పెరిగింది వీటి సంతతి తరిగింది..ఇప్పుడు ఎక్కడో పల్లెల్లో మాత్రం కోతలప్పుడు కనపడుతుంటాయి ...నిత్య జీవితంలో సదా పాలుపంచుకునే ఓ జాతి కనుమరుగైందనే బాధ ..