Friday, October 29, 2010

ఎచటికోయి నీ పయనం ..చిత్రం : అమర శిల్పి జక్కన (1964)

ఎచటికోయీ నీ పయనం
ఏమిటోయి ఈ వైనం
ఏలనోయి ఈ ఘోరం
ఎవరిపైన నీ వైరం

మధురమైన జీవితాల కథ ఇంతేనా
ప్రేమికులకు విధి యొసగిన వరమింతేనా
మధురమైన జీవితాల కథ ఇంతేనా

నిను నమ్మిన నీ సతినే నమ్మలేక పోయావా
శిలలను కరిగించు నీ వు శిలవే అయి పోయావా
మధుర మైన జీవితాల కథ ఇంతేనా

వెన్నలతో విందు చేయు పున్నమి చంద్రుడవు నీవు
కళలు మాసి కాంతి బాసి గ్రహణం పాలైనావా
మధురమైన జీవితాల కథ ఇంతేనా

విరబూసిన చెట్టులాగ మురిసిపోవు నీ బ్రతుకే
వాడి మాడి మోడుబారి వన్నె మాసి పోయిందా
ఎచటి కోయి నీ పయనం
ఏమిటోయి ఈ వైనం
ఏలనోయి ఈ ఘోరం
ఎవరి పైన నీ వైరం.

No comments: