Sunday, October 24, 2010

ఈ పాట నీ కోసమే హొయ్ ..చిత్రం : నిర్దోషి (1970)

ఈ పాట నీ కోసమే హోయ్
ఈ ఆట నీ కోసమే..
ఈ పాట నీ కోసమే హోయ్
ఈ ఆట నీ కోసమే..
ఈ పూలు పూచేది ఈ గాలి వీచేది
మనసైన మన కొసమే
ఓయి ఈ పాట ......//

పగలయిన రేయైన నీ ధ్యానమే
నిలువెల్ల రగిలించు నీ మౌనమే
అహహ ఒహొహొ ఓహొహో
పగలయిన రేయైన నీ ధ్యానమే
నిలువెల్ల రగిలించు నీ మౌనమే
నీ చూపు నా పాలి సుమబాణమే //2//
నిను చూడ కదలాడు నా ప్రాణమే
ఈ పాట నీకోసమే ...............

నీ గుండెలో నేను దాగుంటిని
నీ గారడీలన్ని కనుగొంటిని
అహహ ఒహొహొ ఓహొహో
నీ గుండెలో నేను దాగుంటిని
నీ గారడీలన్ని కనుగొంటిని
నీ కళ్ళ వెనకాల నేనుంటిని //2//
కనరాని వలయాలు కనుగొంటిని

ఈ పాట నీ కోసమే హోయ్
ఈ ఆట నీ కోసమే..

No comments: