2013 చివారాఖరి దశ లో కొచ్చాం ఇలా వచ్చి అలా మాయమైపోతున్నాయి ఈ సంవత్సరాలు. ఒక్క వయసు పెరగడం తప్ప గొప్పగా సాధించిందేమీ లేదు . ప్రతిఏడు చివర అలా వెనక్కి వెళ్ళి రావటం అలవాటు.ఇక నా జీవితానికి మార్పులు చేర్పులు అనవసరమైనా అనుభవాన్ని పంచితేనే చరిత్రవుతుంది .
సరిగ్గా 50 ఏళ్ళక్రితం పరిస్థితి ఎలా ఉండేదో చూడండి అప్పుడు
ఇడ్లి 2 = 0.05 పైసలు
దొశ 1 = 0.10 పైసలు
మలకపేట కాలనీ నుంచి కోఠీ = 0.07 పైసలు
రిక్షా ఎక్కితె 0.25 పైసలు
సిగెరెట్టు - 0.03 పైసలు రెండు కొంటే 0.05 పైసలు.
పెట్రోలు = 0.67 పైసలు
బంగారం = 63.00 రూపాయలు
సినిమా నేలటికెట్టు 0.19 పైసలు
ఇవి చూసి మేమేదో ఆనందం పొందామనుకుంటే పొరపాటే. ఇప్పటి జీతాలతో మీరు పొందే మనస్థితే అప్పటి జీతాలతో మేం పొందింది. ఇప్పుడు అనుకోటానికి మాత్రం కైలాస శిఖరాలు ఎక్కినంత తృప్తి .
ఇక రాబోయే కాలాలు ఎలాఉంటాయో ఏమో .. అప్పటి తరం వాళ్ళకు ఈ జీవితాలే గొప్ప ఆనందాని ఇస్తాయేమో .....