ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు
దేశ దేశాలన్ని తిరిగి చూసేవు
ఏడ తానున్నాడో బావ
జాడ తెలిసిన పోయిరావా!
గగనసీమల ఓ మేఘమాల
మా ఊరు గుడి పైని మసలి వస్తున్నావా!
మల్లి మాటేదైన నాతో మనసు చల్లగా చెప్పి పోవా
నీలాల ఓ మేఘమాల! రాగాల ఓ మేఘమాల!
మమత తెలిసిన మేఘమాల!
నా మనసు బావకు చెప్పి రావా!
ఎన్నాళ్లు నా కళ్లు దిగులుతో రేపగలు
ఎదురుతెన్నులు చూచెనే బావకై
చెదిరి కాయలు కాచెనే అందాల
మనసు తెలిసిన మేఘమాల!
మరువలేనని చెప్పలేవా!
మల్లితో మరువలేనని చెప్పలేవా!
కళ్లు తెరచినగాని కళ్లు మూసినగాని
మల్లి రూపే నిలిచెనే
నా చెంత మల్లి మాటే పిలిచెనే!
జాలి గుండెల మేఘమాల!
నా బావ లేనిది బ్రతుకజాల!
కురియు నా కన్నీరు గుండెలో దాచుకొని
వానజల్లుగ కురిసిపోవా కన్నీరు
ఆనవాలుగా బావమ్రోల
No comments:
Post a Comment