మ్మ్ మ్మ్
దేవుడే ఇచ్చాడు వీధి ఒక్కటి
దేవుడే ఇచ్చాడు వీధి ఒక్కటి
ఇక ఊరేల సొంత ఇల్లేలా
ఇక ఊరేల సొంత ఇల్లేలా ఓ చెల్లెలా
ఎలా ఈ స్వార్ధం ఏది పరమార్ధం
దేవుడే
నన్నడిగి తల్లి తండ్రి కన్నారా ఆ ఆ ఆ
నన్నడిగి తల్లి తండ్రి కన్నారా
నా పిల్లలే నన్నడిగి పుట్టారా
పాపం పుణ్యం నాది కాదె పోవే పిచ్చమ్మ
నారు పోసి నీరు పోసే నాధుడు వాడమ్మా
ఏది నీది ఏది నాది ఈ వేదాలు పుత్త వాదాలె ఓ చెల్లెలా
ఎలా ఈ స్వార్ధం ఏది పరమార్ధం
దేవుడే
శిలలేని గుడికేల నైవేద్యం
ఈ కలలోని సిరికేలా నీ సంభరం
ముళ్ళ చెట్టుగా చుట్టూ కంచే ఎందుకె పిచ్చమ్మ
కళ్ళులేని కబోది చేసి దీపం నీవమ్మా
తొలుత ఇల్లు తుదకు మన్ను
ఈ బ్రతుకెంత దాని విలువెంత ఓ చెల్లెలా
ఎలా ఈ స్వార్ధం ఏది పరమార్ధం
దేవుడే
తెలుసేట్లు చెప్పేది సిద్దాంతం
అది తెలియక పోతేనే వేదాంతం
మన్నులోన మాణిక్యాని వెతికే వెర్రమ్మ
నిన్న నువ్వే తెలుసుకుంటే చాలును పోవామ్మ
ఏది సత్యం ఏది నిత్యం ఈ మమకారం వొట్టి అహంకారం ఓ చెల్లెలా
ఎలా ఈ స్వార్ధం ఏది పరమార్ధం
దేవుడే
No comments:
Post a Comment