Monday, March 16, 2009

ఎవరన్నారివి కన్నులని ..చిత్రం ::: దొరికితే దొంగలు

ఎవరన్నారివి కన్నులని .. ఎవరన్నారివి కన్నులని

అరెరే మధువొలికే గిన్నెలవి

ఎవరన్నారివి బుగ్గలని .. ఎవరన్నారివి బుగ్గలని

హోయ్. ఎఱ్ఱని రోజా మొగ్గలవి

ఎవరన్నారివి కనులని

నడుమిది ఏమంటున్నది .. ఈ నడుమిది ఏమంటున్నది

నా పిడికిట ఇమిడెదనన్నది

నల్లని జడ ఏమన్నది … నా నల్లని జడ ఏమన్నది

అది నను బంధించెద నన్నది .. నను బంధించెద నన్నది

ఎవరన్నారివి కన్నులని ..అరెరే మధువొలికే గిన్నెలవి

ఎవరన్నారివి బుగ్గలని ..హోయ్. ఎఱ్ఱని రోజా మొగ్గలవి

సిగ్గులు దోసిట దూయకు .. నా సిగ్గులు దోసిట దూయకు

నీ చేతుల బందీ చేయకు .. నీ చేతుల బందీ చేయకు

మెల్లగ లోలో నవ్వకు .. మెలమెల్లగ లోలో నవ్వకు

చలచల్లగ పిడుగులు రువ్వకు .. చల్లగ పిడుగులు రువ్వకు

ఎవరన్నారివి కన్నులని ..అరెరే మధువొలికే గిన్నెలవి

ఎవరన్నారివి బుగ్గలని ..హోయ్. ఎఱ్ఱని రోజా మొగ్గలవి

అడుగున అడుగిడుటెందుకు .. నా అడుగున అడుగిడుటెందుకు

నువు తడబడి పోతున్నందుకు

మరిమరి చూచెదవెందుకు .. నను మరిమరి చూచెదవెందుకు

నువు మైకంలో ఉన్నందుకు .. మైకంలో ఉన్నందుకు

ఎవరన్నారివి కన్నులని ..అరెరే మధువొలికే గిన్నెలవి

ఎవరన్నారివి బుగ్గలని ..హోయ్. ఎఱ్ఱని రోజా మొగ్గల
వి

రాననుకున్నావేమో ఇక రాననుకున్నావేమో ..చిత్రం : మంచిమనిషి

రాననుకున్నావేమో .. ఇక రాననుకున్నావేమో

ఆడినమాటకు నిలిచేవాడను కాననుకున్నావేమో .. ఏమో

ఏమనుకున్నారేమో … తమరేమనుకున్నారేమో

మీ చేతులలో కీలుబొమ్మలం మేమనుకున్నారేమో .. ఏమో

చక్కని కన్నెవు ముక్కున కోపం నీకేలా .. నీకేలా ..

చల్లగాలిలో ఆటలాడగా రావేలా .. రావేలా ..

పిలిచిన వెంటనే పరుగున చెంతనే చేరాలా .. చేరాలా ..

వలచివచ్చి నే చులకనైతిగా ఈవేళా .. ఈవేళా ..

ఏమనుకున్నారేమో … తమరేమనుకున్నారేమో

మీ చేతులలో కీలుబొమ్మలం మేమనుకున్నారేమో .. ఏమో

దొరగారేదో తొందర పనిలో మునిగారా .. మునిగారా ..

అందుచేతనే అయినివారినే మరిచారా .. మరిచారా ..

నిజమే తెలియక నిందలు వేయకు నా మీదా .. నా మీదా ..

మాట విసురులూ మూతి విరిపులూ మర్యాదా .. మర్యాదా ..

రాననుకున్నావేమో .. ఇక రాననుకున్నావేమో

ఆడినమాటకు నిలిచేవాడను కాననుకున్నావేమో .. ఏమో

క్షణమే యుగమై మనసే శిలయై నిలిచానే .. నిలిచానే ..

నిన్ను చూడకా క్షణమె యుగముగా గడచేనే .. గడచేనే ..

ఎడబాటన్నది ఇకపై లేదని అందామా .. ఆందామా ..

ఈడు జోడుగా తోడు నీడగా ఉందామా .. ఉందామా ..

Saturday, March 14, 2009

ఊయలలూగినదోయీ మనసే ..ఫిల్మ్ : బొబ్బిలి యుద్ధం

ఊయల లూగినదోయి మనసే …

తీయని ఊహల తీవెలపైన …

ఊయల లూగినదోయి మనసే …

తీయని ఊహల తీవెలపైన

ఊయల లూగినదోయీ

వెన్నెల పూవులు విరిసే వేళ

సన్నని గాలులు సాగే వేళ

వలపులు ఏవో పలికెను నాలో ….

వలపులు ఏవో పలికెను నాలో

తెలుపగ రానిది ఈ హాయి

ఊయల లూగినదోయి మనసే

తీయని ఊహల తీవెలపైన

ఊయల లూగినదోయీ

కమ్మని రాతిరి రమ్మని పిలిచే

మల్లెల పానుపు మనకై నిలిచే

ప్రాయము నీవై పరువము నేనై ….

ప్రాయము నీవై పరువము నేనై

పరిమళించగా రావోయి…

ఊయల లూగినదోయి మనసే

తీయని ఊహల తీవెలపైన

ఊయల లూగినదోయీ

చూచి వలచి చెంతకు పిలచి ...చిత్రం : వీరాభిమన్యు

చూచి వలచి చెంతకు పిలచి సొగసులు లాలన చేసి

నీ సొంపుల ఏలికనైతి

చూచి వలచి చెంతకు చేరి నా సొగసులు కానుక చేసి

నీ మగసిరి బానిసనైతి

చూచి వలచి చెంతకు చేరి సొగసులు కానుక చేసి

నీ మగసిరి బానిసనైతి

అందాలన్నీ దోచి ఆనందపుటంచులు చూచి

అందాలన్నీ దోచి ఆనందపుటంచులు చూచి

సందిట బందీ చేసి … సందిట బందీ చేసి

నా బందీ వశమై పోతి

చూచి వలచి చెంతకు చేరి సొగసులు కానుక చేసి

నీ మగసిరి బానిసనైతి

నూతన వధువై నిలచి వరుని వలపుల వధువై మారి

నూతన వధువై నిలచి వరుని వలపుల వధువై మారి

సఖుని ఒడిలో తురిగి .. సఖుని ఒడిలో తురిగి

కోటి సుఖముల శిఖరమునైతి

చూచి వలచి చెంతకు పిలచి సొగసులు లాలన చేసి

నీ సొంపుల ఏలికనైతి

వలపుల తేనెల మధురిమ గ్రోలితి నిదుర జగము మరచీ

వలపుల తేనెల మధురిమ గ్రోలితి నిదుర జగము మరచీ

నీవే జగమై .. నీలో సగమై .. నేటికి నిండుగ పండితి ..

చూచి వలచి చెంతకు పిలచి సొగసులు లాలన చేసి

నీ సొంపుల ఏలికనైతి

చూచి వలచి చెంతకు చేరి సొగసులు కానుక చేసి

నీ మగసిరి బానిసనైతి

చూచి వలచి చెంతకు పిలచి నీ సొగసులు లాలన చేసి

నీ సొంపుల ఏలికనైతి

తూలీ సోలెను తూరుపు గాలి ..చిత్రం : అడుగుజాడలు

తూలీ సోలెను తూరుపు గాలి – గాలివాటులో సాగెను నావ

తూలీ సోలెను తూరుపు గాలి – గాలివాటులో సాగెను నావ

నావను నడిపే మాలిని నేనే – నావను నడిపే మాలిని నేనే

నన్నే నడిపే దేవత నీవే …

తూలీ సోలెను తూరుపు గాలి

గాలివిసరి నీ కురులే చేదరీ నీలి మబ్బులే గంతులు వేసే

బెదరు పెదవుల నవ్వులు చూసి – బెదరు పెదవుల నవ్వులు చూసి

చిరు కెరటాలే చిందులు వేసే – చిరు కెరటాలే చిందులు వేసే

తూలీ సోలెను తూరుపు గాలి

చెలి కన్నులలో చీకటి చూచీ జాలి జాలిగా కదలెను నావ

చీకటి ముసరిన జీవితమల్లే – చీకటి ముసరిన జీవితమల్లే

నీ కన్నులతో వెదకెద త్రోవ – నీ కన్నులతో వెదకెద త్రోవ

తూలీ సోలెను తూరుపు గాలి – గాలివాటులో సాగెను నావ

తూలీ సోలెను తూరుపు గాలి – గాలివాటులో సాగెను నావ

నావను నడిపే మాలిని నేనే – నావను నడిపే మాలిని నేనే

నన్నే నడిపే దేవత నీవే …

తూలీ సోలెను తూరుపు గాలి

హైలేసా హైలేసా హైలే హైలేసా – హైలేసా హైలేసా హైలే హైలేసా

Friday, March 13, 2009

హిమగిరి సొగసులూ మురిపించును మనసులు ...చిత్రం : పాండవవనవాసం

హిమగిరి సొగసులూ మురిపించునూ మనసులూ2
చిగురించు ఏవేవో వూహలు
హిమగిరి
యోగులైనా మహాభోగులైనా మనసు పడే మనోజ్ఞసీమ2
సురవరులు సరాగాల చెలులా2
కలిసి సొలసే అనురాగసీమ
హిమగిరి
గిరినే ఉమాదేవి హరుని సేవించి తరించెనేమో2
సుమశరుడూ రతీదేవి చేరి2
కేళీ తేలీ లాలించేనేమా
హిమగిరి

Thursday, March 12, 2009

ముత్యాల చెమ్మ చెక్క ....చిత్రం : బొబ్బిలియుద్ధం

ముత్యాల చెమ్మచెక్క రత్నాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా
కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగల లాడ

//ముత్యాల//
తళ తళ తళ తళ మెరిసే సొగసు
ఇంపైన సంపంగి అమ్మాయి మనసూ పరువము వేసిన పందిరిలో
బుజబుజ రేకులు పూయవలె

//ముత్యాల//
ఒప్పులకుప్ప - వయ్యారి భామా
సన్నబియ్యం - చాయపప్పు
చిన్నమువ్వ - సన్నగాజు
కొబ్బరికోరు - బెల్లప్పచ్చు
గూట్లో రూపాయ్ - నీ మొగుడు సిపాయ్
రోట్లో తవుడు - నీ మొగుడెవడు
ఘుమ ఘుమ ఘుమ ఘుమ చారెడేసి మొగ్గలు
గులాబి జవ్వాది అమ్మాయి బుగ్గలు
ఆడిన ఆటలు నోములయి కోరిన పెనిమిటి దొరకవలె

//ముత్యాల//

పిలిచినా బిగువటరా ఔరౌరా ...చిత్రం : మల్లీశ్వరి

పిలిచినా బిగువటరా ఔరౌరా
చెలువలు తామే వలచి వచ్చిన
పిలిచినా బిగువటరా ఔరౌరా
చెలువలు తామే వలచి వచ్చిన
భళిరా రాజా
ఈ నయగారము ఈ వయ్యారము
ఈ నవ యవ్వన మారం వినునే
ఈ నయగారము ఈ వయ్యారము
ఈ నవ యవ్వన మారం వినునే
పిలిచినా బిగువటరా
గాలుల తేనెల వాడని మమతల
గాలుల తేనెల వాడని మమతల
నీలపు మబ్బుల నీడను గననను
అందెల రవళుల సందడి మరిమరి
అందగాడా ఇటు తొందర చేయగా
పిలచిన బిగువటరా

Tuesday, March 10, 2009

హి కృష్ణా ముకుందా మురారి ..:చిత్రం : పాండురంగ మహత్యం

హే .. కృష్ణా.. ముకుందా.. మురారీ...
జయ కృష్ణా ముకుందా మురారీ
జయ గోవింద బృందావిహారీ
... కృష్ణా ....
దేవకి పంట వసుదేవు వెంట
యమునను నడిరేయి దాటితివంట
వెలసితివంట నందుని ఇంట
వ్రేపల్లె ఇల్లాయె నంటా - 2
కృష్ణా .....
నీ పలుగాకి పనులకు గోపెమ్మ - 2
కోపించి నిను రోట బంధించెనంట
ఊపున బోయి మాకుల గూలిచి - 2
శాపాలు బాపితివంట
కృష్ణా .....
అమ్మా తమ్ముడు మన్ను తినేనూ ..చూడమ్మా అని రామన్న తెలుపగా
అన్నా అని చెవి నులిమి యశోద ..ఏదన్నా నీ నోరు చూపుమనగా..
చూపితివట నీ నోటను .. బాపురే పదునాల్గు భువన భాండమ్ముల
ఆ రూపము గనిన యశోదకు తాపము నశియించి జన్మ ధన్యత గాంచెన్
జయ కృష్ణా ...
కాళీయ ఫణి ఫణ జాలాన ఝణ ఝణ
కేళీఘటించిన గోప కిశోరా..- 2
కంసాది దానవ గర్వాపహార -2
హింసా విదూరా పాప విదారా
కృష్ణా ....
కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం
కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరి చందనంచ కలయం
కంఠేచ ముక్తావళీమ్ గోపస్త్రీ పరివేష్ఠితో విజయతే గోపాల చూడామణీ - ౨
లలిత లలిత మురళీస్వరాళీ - 2
పులకిత వనపాలీ గోపాలీ
పులకిత వనపాలీ
విరలీకృత నవరాసకేలీ - 2
వనమాలీ శిఖిపించమౌళి - 2
కృష్ణా ...

వేషము మార్చెను భాషను మార్చెను ...చిత్రం :: గుండమ్మ కథ

వేషము మార్చెను... హోయ్!
భాషను మార్చెను... హోయ్!
మోసము నేర్చెను ....
అసలు తానే మారెను...
అయినా మనిషి మారలేదు, ఆతని మమత తీరలేదు!

మనిషి మారలేదు, ఆతని మమత తీరలేదు!
క్రూరమృగమ్ముల కోరలు తీసెను, ఘోరారణ్యములాక్రమించెను (2)
హిమాలయముపై జండా పాతెను, (2) ఆకాశంలో షికారు చేసెను
అయినా మనిషి మారలేదు, ఆతని కాంక్ష తీరలేదు!
పిడికిలి మించని హృదయములో కడలిని మించిన ఆశలు దాచెను (2)

వేదికలెక్కెను, వాదము చేసెను, (2) త్యాగమె మేలని బోధలు చేసెను
అయినా మనిషి మారలేదు, ఆతని బాధ తీరలేదు!
వేషమూ మార్చెను, భాషనూ మార్చెను,
మోసము నేర్చెను, తలలే మార్చెను...
అయినా మనిషి మారలేదు, ఆతని మమత తీరలేదు!
ఆ...ఆహహాహాహ ఆహాహహా...
ఓ... ఓహొహోహోహో ఓహోహొహో...