Thursday, December 3, 2009

తాళి కట్టు శుభవేళ ......చిత్రం : అంతు లేని కథ

తాళి కట్టు శుభవేళ మేడలో కల్యణమాల

ఒహోహూ ఆహాహా మ్మ్ మ్మ్ హేయ్హేయ్హేయ్

తాళి కట్టు శుభవేళ మేడలో కల్యణమాల

ఏనాడు జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో

ఏనాడు జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో


తాళి


వికటకవిని నేను వినండి ఒక కధ చెపుతాను

కాకులు దూరని కారడవి

అందులో కాలం ఎరుగని మానొకటి

అందాల మానులో అద్బుత వనంలో

చక్కని చిలకలు అక్క చెల్లెలు పక్కన గోరింకలు

ఒక గోరింకకు చిలకమ్మకు ఒద్దిక కుదిరేనమ్మ

బావ రావా నన్నేలుకోవా


తాళి


మేళాలు తాళాలు మంగళ వాద్యాలు మిన్నంటి మోగేనమ్మ

మేళాలు తాళాలు మంగళ వాద్యాలు మిన్నంటి మోగేనమ్మ

వలపు విమానాల తలపుల వేగాన వచ్చాయి కంకాలమ్మ

ఊరేగు దారులు వయ్యారి భామలు వీణలు మీటిరమ్మ

సింగారి జాణల ముంగాలి మువ్వలు ఘల్లున మొగేనమ్మ


తాళి


గోమాత లేగతో కొండంత ప్రేమతో దీవించ వచ్చెనమ్మా

కాన్వెంటు పిల్లల పోలిన నెమలులు గ్రీటింగ్స్ చెప్పిరమ్మ

నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివేనమ్మ

నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివేనమ్మ

పట్టపు టేనుగు పచ్చగా నూరేళ్ళు వర్దిల్లమనేనమ్మ


తాళి


చేయి చేయిగా చిలుక గోరింక సయ్యకు తరలిరమ్మ

చెల్లిలికోసం త్యాగము చేసిన చిలుకమ్మ తొలగేనమ్మ

తప్పుగా తలచిన అప్పటి గోరింక ఇప్పుడు తెలిసెనమ్మ

అది చిలుకే కాదని బావిలో కప్పని జాలిగా తలచేనమ్మా


తాళి

1 comment:

పావనీలత (Pavani Latha) said...

వినాయకం గారు
పాత పాటల మీ బ్లాగు చాలా బాగుంది.ముఖ్యంగా హిందీ పాటల కలెక్షన్ చాలా బాగుంది.

www.geetaanjali.blogspot.com