Sunday, July 17, 2011

ఎంత ఘాటు ప్రేమయో...చిత్రం : పాతాళభైరవి (1951)

ఎంత ఘాటు ప్రేమయో ఎంత తీవ్రవీక్షణమో ఓ

ఎంత ఘాటు ప్రేమయో

కన్నుకాటు తిన్నదిగా కళలు విరిసెనే నా

మనసు మురిసేనే నా మనసు మురిసేనే ..

ఎంత ఘాటు ప్రేమయో ..


ఎంత లేత వలపులో.ఎంత చాటు మోహములో..ఓ

ఎంతలేతవలపులో

కన్నులలో కనినంతనే తెలిసిపోయెనే

నా మనసు నిలిచేనే..నా ..మనసు నిలిచేనే

ఎంత లేత వలపులో ..


ఈ జాబిలి ఈ వెన్నెల ఈ మలయానిలమూ ..//2//

విరహములొ వివారాలను విప్పి చెప్పెనే

ఎంత ఘాటు ప్రెమయో..


ఓ జాబిలి ఓ వెన్నెల ఓ మలయానిలమా..//2//

ప్రియురాలికి విరహాగ్ని ని పెంపుజేయవే..

ఎంత ఘాటు ప్రేమయో..

No comments: