Saturday, July 23, 2011

ఏమివ్వను నీకేమివ్వను.... చిత్రం :సుపుత్రుడు (1971)

ఏమివ్వను నీకేమివ్వను

నా మనసే నీదైతే ఏ మివ్వను

నన్నే వలచి నా మేలు తలచి //2//

లేని కళంకం మోసిన ఓ చెలీ

మచ్చలేని జాబిలీ

ఏమివ్వను నీకేమివ్వను

నా మనసే నీదైతే ఏ మివ్వను..


తారకలే కోరికలై మెరియగా

కనులు విరియగా

వెన్నెలలే వేణువులై పలుకగా

మధువు లొలకగా

యుగయుగాలు నిన్నే వరియించనా

నా సగము మేన నిన్నే దరియించనా

ఏమివ్వను నీకేమివ్వను

నా మనసే నీదైతే ఏ మివ్వను


ఏమడగను ఇంకేమడగను

నీ మనసే నాదైతే ఏమడుగను

నీ కన్నుల వెలుగులేతారకలై నయన తారకలై

నీ నవ్వులజిలుగులేచంద్రికలై కార్తీక చంద్రికలై

జగమంతా నీవే అగుపించగా

నీ సగము మేన నేనె నివసించగా

ఏమడగను ఇంకేమడగను

నీ మనసే నాదైతే ఏమడుగను

నిన్నేవలచి నీ మేలు తలచి..//2//

బ్రతుకేనీవైపరశించు చెలిని నీ జాబిలిని

ఏమడగను ఇంకేమడగను

నీ మనసే నాదైతే ఏమడుగను


ఆహాహా ఆహాహా హహహ

ఊహుహు ఊహుహుహు

No comments: