ఆడపిల్లగా పుట్టాక
చేరదిసినవారంతా
సొంతమై పోరు
కోర్కెల ప్రవాహంలో
కన్నె వయసు పోయింది
కష్టాల మబ్బుల మధ్య
ఓదార్పు పవనాలకై వేచియున్నా ..
చీర కప్పిన దేహాన్ని
చిరుగులు చూపిస్తుంది
మనస్సాక్షి
మనశ్శాంతి తో
విభేదిస్తుంది
ఇక్కట్ల నుంచి
అక్కున చేర్చుకునే
ఆధారం కావాలి
ఎంత లేశమైనా....
No comments:
Post a Comment