Saturday, December 29, 2007

చెరువులో నీళ్ళొచ్చాయి...


వర్షం వెలిసింది
చెరువులో నీళ్ళొచ్చాయి
నెల క్రితం ఎండి బీటలువారిన గుండె
నేడు నిండి లయబద్ద నృత్యం చేస్తూ


గట్టుమీది చెట్లు
ఆకుల్లో తడి ఆర్చుకుంటున్నాయి
చల్లగాలి సహయంతో


నీటిలో బింబాల్ని చూస్తూ
ఆకులు సవరించుకుంటున్నాయి మరి కొన్ని


లేలేత కిరణాల
తళుకుబెళుకు లందుకుని
అటు ఇటూ కదిలే అలలు


కాళ్ళు కదపకుండా
కళ్ళూ తిప్పుతూ
కొంగల
విన్యాసాలు
గట్టు పై కుహూ కుహూ రావం
నీటిలో బెక బెకల తాళం


పూల పేరంటాలు
సీతాకోక చిలుకల హడావిడి

ప్రకృతితో ప్రకృతిని నింపడం
బహుశా, ఒక్క అంతర్యామికే సాధ్యం

No comments: