నీలి మేఘమా జాలి చూపుమా
ఒక నిమిషమాగుమా
నా రాజుతో ఈ రాతిరి
నన్ను కలిపి వెళ్ళుమా
కన్నె అందమా కలత మానుమా
ఒక నిమిషమాగుమా
నీ దైవము నీ కోసము
యెదుట నిలిచె చూడుమా
ఆనుకోని రాగాలు వినిపించనే
కనరాని స్వర్గాలు దిగివచ్చేనే
ఆనుకోని రాగాలు వినిపించేనే
కనరాని స్వర్గాలు దిగివచ్చేనే
కలలు పండి నిజముగా
కనుల యెదుట నిలిచెగా
రా జాబిలి నా నెచ్చెలి
జాగేల ఈ వేళ నను చె్‌రగా
No comments:
Post a Comment