ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది
ఏ వింత అనుభంధ మౌనో
అప్పడి అన్నా ..అర్థం కాలేదా
ఏ తీగ పూవునొ ఏ కొమ్మ తేటినో కలిపింది
ఏ వింత అనుభందమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో
మనసు మూగది మాటలు రానిది
మమత ఒకటే అది నేర్చినది
ఆహా అప్పడియా
పెద్ద అర్థమయినట్లు
భాషలేనిది బంధమున్నది
మన ఇద్దరినీ జత కూర్చినది
వయసే వయసును పలుకరించినది
వలదన్నా అది నిలువకున్నది
ఏయ్ నీ రొంబ అళహాయిరుక్కే
ఆ..రొంబ ..అంటే
ఎల్లలు ఏవీ ఒల్లలన్నది
నీదీ నాదోక లోకమన్నది
తొలిచూపే నను నిలవేసినది
మరుమాపై అది కలవరించినది
నల్ల పొణ్ణు అంటే నల్ల పిల్ల
మొదటి కలయికే ముడివేసినది
తుది దాకా ఇది నిలకడైనది
No comments:
Post a Comment