Wednesday, October 20, 2010

ఈ పగలు రేయిగా పండు వెన్నెలగ ..చిత్రం : సిరిసంపదలు (1962)

ఈ పగలు రేయిగా పండు వెన్నెలగ మారినదేమి చెలీ
ఆ కారణమేమి చెలీ
అ ...
ఊ ....
వింత కాదు నా చెంత నున్నది
వెండి వెన్నెల జాబిల్ నిండు పున్నమి జాబిలి
ఓ ...
మనసున తొణికే చిరునవ్వెందుకు పెదవుల మీదికి రానీవు
అహ్హ ..ఒహో ..ఆహా..ఆ
మనసున తొణికే చిరునవ్వెందుకు పెదవుల మీదికి రానీవు
పెదవి కదిపితే మదిలో మెదిలే మాట తెలియునని మానేవు
ఊ ... ....// వెండి //

కన్నులు తెలిపే కథలనెందుకు రెప్పలార్చియే మార్చేవు
అహ్హ ..ఒహో ..ఆహా..ఆ

కన్నులు తెలిపే కథలనెందుకు రెప్పలార్చియే మార్చేవు
చెంపలు పూచే కెంపులు నాతో నిజము తెలుపునని దడిసేవు
ఓ హోహో
//వెండి //
అలుక చూపి అటువైపు తిరిగితే అగుపడదనుకుని నవ్వేవు
ఉహ్హూ హ్హూ
అలుక చూపి అటువైపు తిరిగితే అగుపడదనుకుని నవ్వేవు
నల్లని జడలో మల్లెపూలు నీ నవ్వులకర్థం చూపేను
అహ ...
// వెండి ..//

1 comment:

sobharani said...

aanandaanni panche andamyna bhaavam.