ఏ శుభ సమయంలో
ఈ కవి హృదయంలో
నీ కాలి అందెలు మ్రోగినవొ
ఎన్నెన్ని ఆశలు పొంగినవో
ఏ శుభసమయంలో
ఈ చెలి హృదయంలో
నీ ప్రేమగీతం పలికిందో
ఎన్నెన్ని మమతలు చిలికిందో
అహ్హా.......అహా
అహా ,,,,,,,అహా
ఆహాహాహాహాహ
కలలో నీవె ఊర్వశివే ఇలలో నీవే ప్రేయసివే ../2/
ఆ ..నీడేలేని నాకోసంతోడైఉన్న దేవుడివే../2/
చిక్కని చీకటిలోన అతి చక్కని జాబిలివే
ఏ శుభసమయంలో
మనిషై నన్ను దాచావు కవివై మనసు దొచావు
నిన్నే గెలుచుకున్నాను నన్నే తెలుసుకున్నాను
పందిరినోచనిలతకు నవ నందనమైతివి నీవే
ఏ శుభసమయంలో..
నీ ప్రేమగీతం పలికిందో
ఎన్నెన్ని మమతలు చిలికిందో
అహ్హా.......అహా
అహా ,,,,,,,అహా
ఆహాహాహాహాహ
2 comments:
వినాయకం గారు, మీ అక్షరవనం చాల బాగుంది. ఈ పాట రెండవ చరణంలో "నవ వందనమైతివి నీవే" కు బదులు "నవ నందనమైతివి నీవే" అని ఉండాలి. నిజానికి ఘంటసాల "పాటల పర్ణశాల" పుస్తకంలో కూడ "నవవందనమైతివి" అని తప్పుగా ప్రచురించారు. అందువలన పాట వింటూ సాహిత్యం సరిగ్గ వ్రాసామో లేదో చూసుకుంటే మంచిది. పదాల మధ్య స్పేస్ ఇస్తే ఇంకా అందంగా ఉంటుంది. వీలైతే పాట రచయిత (దాశరధి), స్వర కర్త (పెండ్యాల నాగేశ్వర రావు) ల పేర్లు కూడ చేరిస్తే ఇంకా సొగసుగా ఉంటుంది. ఇంత మంచి పాటలను వ్రాసిన, బాణీ కట్టిన వారిని తల్చుకుంటే చాల బాగుంటుంది. మీ కృషి ప్రశంసనీయం. కొనసాగించండి.
thank u sir ....
its corrected..now..
Post a Comment