Thursday, November 8, 2007

నవ్వాలి...మీరు


నవ్వు నాలుగు విధాలా చేటు అన్నారు...పెద్దలు ఊరికె అనరుగా
బహుశా అపహస్యాలు వెకిలి నవ్వుల గురించి ఉంటుంది
నవ్వు అనేది ఎంత ఆరోగ్యకరమో...గ్రీకు నాగరికత వెలసిన రోజుల్నుంచి తెలిసిందే
ఇప్పటి ప్రయోగాలు కూడా తనువు మీద మనస్సు మీద


ఎన్నో సత్ఫలితాలిస్తున్నాయంటున్నారు
నేచురల్ టానిక్..
అదేమీ కొనక్కర లేదు..అప్పు తెచ్చుకో నక్కరలేదు..
జీవితం లో ఓ నిత్యావసరం.. ఎలా వాడుకోవాలో తెలియక పోవచ్చు...
అసలు నవ్వంటె ఏమిటి..??మన శరిరం లో ఆందోళన కలిగించే
కార్టిసాల్ ,ఎపినెఫ్రిన్ ,అనే విషాలకు ఇది విరుగుడు...
ఏంక్జైటీ , స్ట్రెస్ లపై కంట్రోల్ సాధించవచ్చు.
అందుకె మనసు తీరా నవ్వులు నవ్వులు నవ్వాలి..
సిగ్గయితే ఒంటరిగ అద్దంచూసి నవ్వుకొండి..
మెకానికల్ జీవితాల్లో సంతోషం కూడ రేషనయిపోయింది..
అందుకే పుట్టాయి లాఫింగ్ క్లబ్బులు..
ఇక్కడ నవ్వొచ్చు కాని పనిగట్టుకపోయి నవ్వాలి ......ఇబ్బందే..
..కానీ అందరి ఆగడాలు..ఆపసోపాలు చూస్తుంటె ఆటోమేటిక్ గా మనకు నవ్వొచ్చేస్తుంది..
అదె టెక్నిక్..


మరీ పడి పడీ నవ్వక్కర్లేదు..ఒళ్ళు గగుర్పాటు చెంది కళ్ళ నీళ్ళ పర్యంతమైతే

నువ్వుఫలితం సాధించినట్లే.
చిన్న చిన్న పనులు ....
మీ వర్క్ టేబుల్ ని శుభ్రం చేసి చూడండి..ఓ రోజు మీ వంటింటిని ఓ రోజు మీ బెడ్ రూం ని..
కాస్త మార్పులు చేసో..క్లీన్ చేసో చూడంది..ఎంత హాయిగా ఉంటుందో....
ఇవన్నీ కూడ మనసుని ఉత్తేజ పరచి ఉల్లాసంగా ఉంచుతాయి..
ఇక పొండి ... ఏదో ఒక పని చేయండిమీ కంప్యూటార్ టేబిల్ తో మొదలెట్టాండి
ఇప్పుడె ఇక్కడే..........
మీ ఫీలింగ్ చెప్పండి..బాయ్...




2 comments:

Padma said...

నేను అర్జెంట్‌గా నా కంప్యూటర్ టేబుల్ క్లీన్ చేసుకోవాలి అయితే. :)

AN UNKNOWN INDIAN said...

నిజం చెప్పరు ,నవ్వు మరియు ఎడుపు మనుషులకు మాత్రమె వున్న గొప్ప వరములు ... ...i would like to share one thing with you in this occation, in every month i watch two films sathileelavathi and matrudevobava to get myself refresh