అబ్బో !! ఒకనాటి అపురూప గీతం.
మరపురాని మధుర సంగీతం. చక్కటి శైలి ,
ఎన్నాళ్ళ తరువాత వింటున్నాను..
టీవీ ముందుకొచ్చా.... పాటేమో అదే దృశ్యాలే వేరు..
కలర్ దృశ్యాలు ..జిగేల్ జిగేల్ మంటూ
కళ్ళు విచ్చుకుంటూ తేరి పార చూసా..:......
రీ మిక్స్ సంగీతాన్ని ....
మగాళ్ళు దూకుడు..
ఆడోళ్ళ వొణుకుడు
కండలన్నీ చూపుడు
రంగులేవో పూసుడు
కాళ్ళు చాచి జారుడు
వొళ్ళంతా తడుముడు
నడుమెత్తి ఊపుడు
ఆ పైన కొరుకుడు
ఎక్కడెక్కడొ తాకుడు
గట్టిగా ఒత్తుడు
తన్మయత్వంతో ఊగుడు
మొహం తోనే పాముడు
కౌగిళ్ళలో చేరుడు
ఒకరినొకరు గీరుదు
వెనక వాళ్ళు లాగుడు
చూపరానివి చూపుడు
బట్టలు తీసి విసురుడు
గుండ్రంగా తిరుగుడు
జనం చప్పట్లు కొట్టుడు
నే ఓరచూపు చూదుదు
మా ఆవిడేమో సణుగుడు
విధిలేక టీవీ ఆపుడు
పాటవిని మోసపోకుడు
లేదు దీనికి విరుగుడు
1 comment:
బాగుందండి.
Post a Comment