కనుపాప కరవైన కనులెందుకు
తనవారె పరులైన బ్రతుకెందుకు
విరజాజి శిలపైన రాలెందుకే
మరుమల్లె సెంధూళి కలసేందుకే
మనసైన చినదాని మనసిందుకే - రగిలేందుకే
అలనాటి మురిపాలు కలలాయెనా
చిననాటి కలలన్ని కధలాయెనా
తలపోసి తలపోసి కుమిలేందుకా - కనులిందుకా
తనవారు తనవారి విడిపోరులే
కనుమూసి గగనాన కలసేరులే
ఏ నాటి కైనాను నీదాననే - నీదాననే
చిననాటి మన పాట మిగిలేనులే
కలకాలమీగాధ రగిలేనులే
రగిలేనులే..రగిలేనులే
No comments:
Post a Comment