ఏమున్నది జీవితం లో
ఓ జననం
ఏడుస్తూ
ఓ మరణం
ఏడిపిస్తూ
ఆట విడుపు కై
కూసింత బాల్యం
త్రుళ్ళిపడె యవ్వనం..
రేపు ఉందో లేదో
ఉంటే ఏముందో
వాడుకోటానికి
' ఒక్కక్షణం '
' ఒక్కక్షణమె '
చేతిలో
ఆ పై అది గతం
గుర్తు చేస్తూ ఉంటుంది
గడపెక్కదు
కలగాపులగం
చిత్రపు ముక్కలం
వరుసలో పడితేనే
చిత్రం
తారు మారయ్యిందా
ఒప్పవు ముక్కలు
చిత్రం రాదు కదా ....
శేష క్షణాలు
అన్వేషిస్తూ ........
1 comment:
First two stanzas excellent. migataadi kuudaa baagunnaa, first remdoo vemtaade vaakyaala laamtivi. mottam kavitani dominate chesesaayi. ee two stanzas nenu eppatikee marchiponu.
saaru,
meeru imta baagaa raastaarani chepperu kaaru :)
Post a Comment