Thursday, April 23, 2009

జో లాలి జో లాలి .. లాలి నా చిట్టి తల్లి ..చిత్రం : ధర్మదాత

జో లాలి జో లాలి లాలి నా చిట్టి తల్లి లాలి నను గన్న తల్లి
లాలి బంగారు తల్లి లాలి నా కల్పవల్లి
జో లాలి
చిరు నవ్వు కిరణాలు చిందించు మోము
కన్నీరు మున్నీరుగా చూడలేను
చిరు నవ్వు కిరణాలు చిందించు మోము
కన్నీరు మున్నీరుగా చూడలేను
నిను గన్న నీ తల్లి కనుమూసె గాని
నిను గన్న నీ తల్లి కనుమూసె గాని
నిను వీడి క్షణమైన నేనుండ గలనా
నిను వీడి క్షణమైన నేనుండ గలనా
జో లాలిరతనాల భవనాల నిన్నుంచలేను
ముత్యాల ఉయ్యాలలూగించలేను
రతనాల భవనాల నిన్నుంచలేను
ముత్యాల ఉయ్యాలలూగించలేను
కనుపాపల నిన్ను కాపాడు కోనా
కనుపాపల నిన్ను కాపాడు కోనా
నిరుపేద ఒడిలోన నిను దాచుకోనా
నిరుపేద ఒడిలోన నిను దాచుకోనా
జో లాలి

No comments: