Tuesday, January 8, 2008

సిరిమల్లె పువ్వా.....

ఇదో అద్భుతమైన పాట.. అరవంలో కాని ,తెలుగులో కాని .. జానకి గారి స్వరం ఎంతో మధురం..ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది


సిరిమల్లె పువ్వా

సిరిమల్లె పువ్వా
సిరిమల్లె పువ్వా
చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే...


!! సిరిమల్లె పూవ్వా !!

తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తాడే
కళ్ళార చూద్దామంటే నా కళ్ళు మూస్తాడే
ఆ అందగాడు నా ఈడు జోడు ఏ .. డే
ఈ సందెకాడ నా సందమావ రా .. డే
చుక్కల్లారా దిక్కులుదాటి వాడెన్నాళ్ళకొస్తాడో


!! సిరిమల్లె పువ్వా !!

కొండల్లొ కోనల్లో కోయన్న ఓ కోయిలా
ఈ పూల వానల్లో ఝుమ్మన్న వో తుమ్మెదా
వయసంతా వలపై మనసే మైమరుపై ఊ . గే . నే
పగలంతా దిగులు రేయంతా వగలు రే .గే .నే
చుక్కల్లార దిక్కులు దాటి వాడెన్నాళ్ళకొస్తాడో

No comments: