Thursday, January 17, 2008

ఏదో ఒకరాగం పిలిచింది ఈ వేళ...(song)

ఏదో ఒకరాగం పిలిచింది ఈ వేళ
నాలో నిదురించే గతమంతా కదిలేలా
ఏదో ఒకరాగం పిలిచింది ఈ వేళ
ఎదలో నిదురించే కధలెన్నో కదిలేలా
నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా
నా ఊపిరి ఊయలలో చిరు నవ్వులు చిలికేలా
జ్ఞాపకాలే మైమరపు జ్ఞాపకాలే మేలుకొలుపు
జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు

ఎదో ఒకరాగం

అమ్మా అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే
రా అమ్మా అని అమ్మే లాలించిన జ్ఞాపకమే
అమ్మ కళ్ళలో అపుడపుడు చెమరింతలు జ్ఞాపకమే
అమ్మ చీరనే చుట్టే పాత జ్ఞాపకమే
అమ్మ నవ్వే జేకొట్టే సిగ్గు జ్ఞాపకమే

ఎదో ఒకరాగం

గుళ్ళో కధ వింటూ నిదురించిన జ్ఞాపకమే
బళ్ళో చదువెంతో బెదిరించిన జ్ఞాపకమే
గువ్వలు ఎన్నో సంపాదించిన గర్వం జ్ఞాపకమే
నెమలి కళ్ళనే దాచే చోటు జ్ఞాపకమే
జామపళ్ళనే దోచే చోటు జ్ఞాపకమె

ఎదో ఒకరాగం

No comments: