Thursday, January 10, 2008

చావు (తో ) కబుర్లు


హాల్లో నమస్కారం , బావున్నారా ! చావుతో ఎందుకు చెలగాటం అనుకుంటున్నారా !! అక్కడికి నేనేదో చంపుకుతిన్నట్టు.. నన్ను తలచుకోకుండా మీకు పూట గడవదు కదా ! మంచిగానో చెడుగానో మీ మీ జీవితాల్లో ఎక్కడో అక్కడ నాపేరో లేక పర్యాయపదమో చెప్పకుండా ఉండగలరా!!: ఉ.దా., జన్మిం 'చావు , పుట్టిం 'చావు , పెం 'చావు , ప్రేమిం 'చావు , రక్షిం 'చావు.,. ఇక తిట్టడంలో అంటారా ' పోయి చావు., పెట్టిచావు., తాగి చావు., ఇచ్చిచావు నీ చావు నువ్వుచావు అని అనలేదా. చావు ., చచ్చాన్రో., చంపేస్తా.,చావకొట్టు , చచ్చినట్టు పడుండు అని వినని రోజుందా ! యింకా కొన్ని మీరు ఉపయోగించే పదాలు ఉన్నాయి గాని ఆ లాంగ్వేజి ని ఇక్కడ ఒప్పుకోరు.. నేను మీ అందరి జోలికి అనవసరంగా రాను.,!! నా డైరీ లో మీ పేరుంటే వదలను !!. ఆందరిలాగా సంవత్సరం డైరీ కాదు నాది. గంటల డైరీ , ప్రతి గంటకి 3600 పేజీలు. ఆ ప్రకారం ద్యూటీ చేయడమే నాపని. అసలు మీకో విషయం తెలుసా ! నేను నా డ్యుటీ చేయలేదనుకోండి మీరేమయ్యేవారో మీకు తెలుసా.... ఇప్పటికీ ఓ పది కిలోమీటర్ల మందాన మీ తాత ముత్తాతల అమ్మమ్మ నానమ్మల శరీరాల గుట్టలపై పుట్టి ఉండేవారు. కదలడానికి స్థలంలేక తినడానికి తిండిలేక ఆ గుట్టల్లోనే రొచ్చు కంపు భరిస్తూ దుర్వాసనలతో... అబ్బ ! ఇక ఊహించుకోండి ..కాబట్టి , నేను మీ సుఖజీవనానికి దోహదం చేసినట్టు అవునా కాదా. అయినా మీ మానవజాతి ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటారు. నా డ్యూటికి సహాయం చేసే ప్రళయం, యుద్ధం, కార్చిచ్చు, మశూచి, కలరా, ప్లేగ్ లాంటి వన్నింటిని సమూలంగా నాశనం చేశారు.అగ్నిపర్వతాలనుంచి రక్షణ పొందారు. వరదలకి ఆనకట్టు కట్టుకున్నారు. అయినా నేను కొత్త ఏజెంట్లు పెట్టుకున్నా భూకంపాలని , ఎయిడ్స్ , కేన్సర్ , ఆక్సిడెంట్లు లాంటివి. ఇప్పుదో కొత్త దోస్తీ కూడా దొరికింది 'సునామీ '. అప్పుడప్పుదు టెర్రరిస్టులని కూడా ఉపయోగించుకుంటా. మీ చట్టంలో నేరమే..,అయినా నాకు వర్తించదు కదా! నాకు అందరు సమానమే. జవహార్ లాల్ నెహ్రూ అయినా జేబుకొట్టే దొంగ అయినా. ఎవరు ఎంత పేరు గలవారైనా నేను కొట్టనంతవరకే ఆ పేర్లు , ఆ బిరుదులు , నాదెబ్బ పడితే అందరికి ఒకేపేరు ' శవం ' . పెద్దయినా చిన్నయినా ధనికుడైనా పేదైనా ఆడ అయినా మగ అయిన ఆఖరికి కొజ్జా అయినా ఒకటే ట్రీట్మెంట్. మమత, ప్రేమ, అనురాగం, అనుబంధం అన్నీ నేను వచ్చెదాకే. నేను కొట్టానంటే మిమ్మల్ని ఇంటిలోపల కూడా చేర్చరు. ఓక్కరోజు పైన ఆ వీధిలోనే ఉంచరు. ఊరు బయటే తగలెట్టినా పూడ్చిపెట్టినా.., బంధుత్వాలు ప్రేమ ఇవేవి అడ్డం రావు. తెలిసీ బంధాలు పెంచుకుంటారు త్రెంచుకోలేక బాధపడతారు.

పూర్వం కూడా ఇలాగే నన్ను వదిలించుకోవాలని ఎందరో ట్రై చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే ఆ పిచ్చోడు హిరణ్యకశిపుడు గురించితెలుసా మీకు. కోరరాని వరాలన్నీ కోరాడు నన్ను తప్పించుకొవాలని, అయినా ఎలాకొట్టానొ తెలుసుకదా. అంతే .ఇంకోడున్నాడు భస్మాసురుడు. వీడు ఏకంగా నా డ్యుటీ చేయటం మొదలెట్టాడు అందర్నీ చంపుకుంటూ.,నాదైరీ లో పేరులేక పోయినా !! వీడు చేసినపనికి మా హై కమాండ్ నన్ను వివరణ కూడా అడిగింది. వాడిని , వాడి చేతులతొనే మట్టుపెట్టించాను.అడపా తడపా ఇలాంటి వాళ్ళు తారసపడుతుంటారు నానుంచి తప్పించుకోవాలని కాని వాళ్ళ ఆటలేవి సాగదు నా దగ్గర.అంతెందుకు మీరు మాటి మాటి కి వెళ్ళే తెల్లకోటుగాళ్ళు.అదే డాక్టర్లు !! వాళ్ళెదో కత్తులూ కటార్లు పుచ్చుకొని, ఏ.సి.రూముల్లొ గుండె తీసి మిషనుపెట్టి కుట్టి ఎదో ఘనకార్యం చేసినట్టు Fఓజులు పెట్తుంటారు.పిచ్చివాళ్ళు వాళ్ళే జీవం పోసినట్లు Fఈలైపోతుంటారు. వాళ్ళకేం తెలుసు నాడైరి లో పేర్లు లేక అటుకేసిపోలేదని !! డ్యూటీ లిస్ట్ లో ఉంటే గుట్టుచప్పుడుకాకుండ వేసేసేవాడిని కదా. అంతెందుకు ఆ డాక్టర్ పేరే ఉంటే అదే టేబుల్ పై కత్తి ముట్టుకోకముందే ఖతం., కొంతమంది నన్నూ ఇబ్బంది పెట్టారనుకోండి. ఆంజనేయుడు.,ధ్రువ., మార్కండేయ, సతీ సావిత్రి లాంటివాళ్ళు. కానీ భూమండలంలో లేరు వాళ్ళు ఇప్పుడు.నా ఇలాకా బయట ఉంటున్నారు. మీకు మా సెట్ అప్ గురించి చెప్పాలి కదా : సుప్రీం కమాండర్ ------ ఆది పరాశక్తి. ప్రెసిడెంటు : యమ శెక్రెటరి -----------------------చిత్రగుప్త సూపర్`వైజర్ -----------------విధి . మాకో స్టాకిస్ట్ ఉన్నాడు ' కోమా ' అని కొన్ని కేసులు మాకు తీరిక లేక , అతని సంరక్షణలో ఉంటాయి , మళ్ళి డిసైడ్ అయ్యేదాక. పసికందుల్ని ,చిన్నవారైన ప్రత్యూష, సౌందర్య లను అప్పుడే ఎందుకు తీసుక పోయావు అని అడుగుతున్నారా ! దానికి కారణం ఉంది, మాలెక్కళ్ళో ఏడేడు జన్మల పాప పుణ్యాలుంటాయి, గత జన్మలో మిగిలిన ఘడియలో , రోజులో ,నెలలో ఈ జన్మలో గడిచాక తీసుకుపోతానన్నమాట. కాబట్టి నామీద అపోహలన్ని తొలగించుకోండి. మా సుప్రీం ని , హై కమాండ్ ని ధ్యానించండి, నన్ను తప్పించుకోలేక పోయినా మనోబలం వస్తుంది. నా డైరీ లో మా సుపర్`వైజర్ మీపేరుసూచిస్తే..నేనేమీ చేయలేను. నన్ను నిందించకండి. నేను డ్యుటీ మైండేడ్.గుడ్డిగా అదేవరుసలో పోతా. ఇది రాసినవాడిని వదిలేస్తాననుకున్నారా .. అనుకుంటే పొరపాటే., వీడి పేరు ఎక్కడుందో ఏమిటో కదా ,!!! ఉంటే వేసేయడమే తప్పదు పాపం .,ప్చ్.,ప్చ్.This was published in Telugupeople.com1 comment: