Thursday, January 24, 2008

అందాలరాణివే నీవెంత జాణవే ..(song )

అందాలరాణివే నీవెంత జాణవే
కవ్వించి సిగ్గుచెందనీకు న్యాయమా .....
అందాలరాణివెవీరాధి వీరులే రణరంగ ధీరులే
ఇదేమి వింత ఏల ఇంత తొందరా ....వీరాధి వీరులే

పరీక్ష చాలునే ఉపేక్ష ఏలనే

సుఖాల తీరము ఇంకెంత దూరము (2)
ఉపేక్ష కాదిది అపేక్ష ఉన్నది నిరీక్ష చాలమంచిది (వీరాధి వీరులే)

క్రీగంటితో ననుదోచి నా గుండెదోంగిలించి (2)

చాటుగా మాటుగా ఆడుటే చాలులే ..
ఆడుటే చాలులేచాలులే చాలులే

శ్రీవారి హృదయము నాకెంతో పదిలము

నా ప్రేమ నిరతము కాపాడు కవచము
ప్రియురాలి రూపము రేగించె మోహము
నేనింక తాళజాలనే(అందాలరాణివే)

మీ వంటివారికి మేలా మేలెంచ పెద్దలు లేరా

వారిదే భారము ఏల ఈ ఆగుము ..
ఆగుము ఆగుము
ఆగను ఆగను
ఏకాంత సమయము ఆనంద నిలయము
నీవెన్ని అనిననూ నీ చేయి విడువను (2)
జగానికందము వివాహ భంధము
ఆనాడే తీరు వేడుకా(అందాలరాణివే)


film ;; bobbili yuddamNo comments: