ఎక్కడ పుడుతావో
ఎప్పుడు పుడుతావో
ఎప్పుడు పుడుతావో
పొడి పొడిగా పైకిలేచి
తడి చేసుకుంటూ తిరుగుతావు
గొంతు ఎంత కఠినమో
రాక అంత మధురము
చీకటి కూడా పగలు లా
నీ వెలుగులో
గొంతు ఎంత కఠినమో
రాక అంత మధురము
చీకటి కూడా పగలు లా
నీ వెలుగులో
అపరిచితులెందరినో
ఒక్క చూరుకింద చేర్చి
చాచిన ప్రతిచేతిని
చల్లగా తడిపి
పుడమంతా కడుగుతావు
కడలిలో కలుపుతావు
చాచిన ప్రతిచేతిని
చల్లగా తడిపి
పుడమంతా కడుగుతావు
కడలిలో కలుపుతావు
ఎప్పటికీ అదే నీరు
అనుభూతులే వేరు వేరు
మళ్ళీ .......
ఎక్కడో॥ఎప్పుడో
This was first published in aavaakaaya.com in December2008
No comments:
Post a Comment