Saturday, January 5, 2008

మా రోజుల్లో ..సినిమా

నమో వెంకటేశా, నమో తిరుమలేశా
నమో నమో శ్రీనివాసా
మహానందమాయే , ఓ మహా దేవ దేవ
ముడుపులు నీకొసగే మా మ్రొక్కులు తీర్చుమయా
ముక్తి కొరివచ్చే నీ భక్తుల బ్రోవుమయా
నరకతుల్యమౌ ఈ భువి స్వర్గము జేయుమయా
మనుజులు నినుజేర పరమార్ధము తెలుపుమయా

ఊరు ; చిత్తూరు
టాకీసు ;గురునాధా టాకీసు


మా యింటికి మూడు వీధులవతల ఈ సినిమా టాకీసు.
ఉన్నవే 3 టాకీసులు..అప్పట్లో మార్నింగ్ షో లు ఉండేవి కావు.
శని ఆది వారాల్లో మాత్రం మ్యాట్నీ షో లుండేవి.
ఏ షో అన్నా కానివ్వండి ఇదే మొదటి రికార్డు.
ఈ పాట మొదలవగానే ఊళ్ళో సినిమాకెళ్ళేవాళ్ళ హడావుడి మొదలవుతుంది
.అప్పట్లో నేల టికెట్టు 19 పైసలు..ఇంట్లో తెలీకుండా వెళ్ళాలంటే మ్యాట్నీ నే గతి
..మొదటి ఆట పెద్దలతోనే వెళ్ళాలి..
రెండో ఆట చూసిందే లేదు..
ఆ 19 పైసలకి ఎన్ని అగచాట్లు..అబద్దాలు..

అణాకు 6 పైసలయితే 3 అణాలకు 18 కావాలి..
19 పైసలంటే అదేం లెఖ్ఖ అనుకుంటారేమో..
పావలా అంటే 25 పైసలు ..అందులో ఒక అణా అంటె 6 పై. తీస్తే 19 అన్నమాట
....మళ్ళీ వాళ్ళ లెఖ్ఖల్లోనే బెంచీ వెల 37 పైసలు ( 6 అణాలు..)
పావలా 25 పైసలు రెండణాలు అంటే 12 పైసలు అన్న మాట

ఆ ఒక్క నయా పైస కు అంత విలువ...



కౌంటరు ముందు సన్నని గొందు లాంటి దారి
చొక్కాలు విప్పి దూరగలిగితే టికెట్లు..
ముందు పోతేనే ఆ థియేటర్లలో స్తంభాలు అడ్డుతగలకుండా
ఫేన్ కింద కూర్చొనే వీలు...లేకుంటె తలలూపుతూచూడాల్సిందే..)
ఇప్పటికీ వవ్వొస్తుంటుంది ఇవ్వన్నీ గుర్తొచ్చి....:))

1 comment:

gsmanyam said...

hahaha saaruu, ayitae inTlO cheppakunDaa sinimaalu chuusina hisTaree meeku kuuDaa undi anna maaTa :)