ఇది మల్లెల వేళయనీ
ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల
ముందే కూసిందీ
విందులు చేసింది
కసిరే ఏండలు కాల్చునని
ముసిరే వానలు ముంచునని
ఇక కసిరే ఏండలు కాల్చునని
ముసిరే వానలు ముంచునని
యెరుగని కొయిల యెగిరింది
చిరిగిన రెక్కల వొరిగింది
నేలకు వొరిగింది
మరిగి పోయేది మానవ హ్రుదయం
కరుణ కరిగేది చల్లని దైవం
వాడే లతకు ఎదురై వచ్చు
వాడని వసంత మాసం
వసి వాడని కుసుమ విలాసం
ద్వారానికి తారా మణి హారం
హారతి వెన్నెల కర్పూరం
మోసం ద్వేషం లేని సీమలో
మొగసాల నిలిచెనీ మందారం
ONE OF THE BEST FROM SUSEELA
No comments:
Post a Comment