Friday, January 25, 2008

బంగారు కోవెల







చిత్తూరు కి 35 కిలో మీటర్ల దూరంలో తమిళ నాడు లోని రాయ వెల్లూరు లో శ్రీపురం వద్ద 100 ఎకరాల భూమిపై శ్రీ నారాయణి పీఠం వారు ఓ పేద్ద స్వర్ణదేవాలయం నిర్మించారు.. ఇందులో దేవత శ్రీ మహలక్ష్మి.ఆగష్టు 24 వ తారీఖు కుంభాభిషేకం జరిగింది. మొత్తం ఆలయం సాక్షాత్తు మహలక్ష్మి స్వగౄహం లా రాగి , బంగారు లతో చేయబడింది.. దాదాపు ఆరేళ్ళు తిరుపతి తి.తి,దే ఆర్టిసన్స్ ,క్రాఫ్ట్స్ మెన్ ఈ దేవాలయం నిర్మించారు.. ఇప్పుడు ఇది పర్యాటకులని విశేషంగా ఆకర్షిస్తుంది. ఇది నిర్మించటానికి 300 కోట్లు ఖర్చయినాయంట..అప్పటి రేటు లో ..

చుట్టూ కొండలు ,55 000 చదరపు అడుగుల దేవాలయం.. శ్రీ చక్రం ఆకారంలో నిర్మించిన ఈ గుడి అన్నికోణాలనుండి నడిస్తే గాని గర్భగుడి చేరలేము..దారిలో అన్ని మతాల సూక్తులు లతో బోర్డులు రాయించారు.. గుడి సాంతం బంగారే..చుట్టూ కందకం ఆ నీటిలో భక్తులు వేసిన నాణేలు..రాత్రిళ్ళు పట్టపగలు లా దీపాల ఎఫెక్టు.వాటి ప్రతిబింబాలు ఈ నీటిలో ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి. చూట్టానికి బాగానెఉంది.. సైట్ సీయింగ్..కడుపు నిండా ప్రసాదం.. ఇకపోతే పీఠాధిపతి 31 సం ..ల యువకుడు.. శక్తి అమ్మ అంటారు.. ఇతనిని దేవుడిలా చూస్తారు వచ్చే భక్త జనం..( అన్నీ చోట్ల ఫార్సే ఇది ) ఇదే నచ్చనిది డబ్బంతా యన్.ఆర్.ఐ. ఫండ్స్.. ఇంత ఖర్చుపెట్టి కట్టకుంటే ఏమీ ?? అనే వారూ ఉన్నారు.. కానీ చూడ తగ్గదని నా అభిప్రాయం.. ఇది పర్యాటకులకి పనికొస్తుందనే పోస్టింగు..

ఇది వేలూరుకి 10 కి.మైళ్ళ దూరంలో ఉంది.ఈ పీఠం వారిదే అనేక సంస్థలున్నాయి..దర్శనం ఫ్రీ....త్వరిత దర్శనానికి 100 రూ...ఒకరికిఅష్టోత్తరం 250/ రూ ఒకరికి..ఈ అర్చన చేయిస్తే దేవుని ముందు కూర్చోనిస్తారు..

వృద్దులు ,అంగవైకల్యం కలవారికి ప్రత్యేక దారి.

అందరూ ఎంజాయ్ చేస్తారనటం లో సందేహం లేదు..

No comments: