Wednesday, March 12, 2008

కలువకు చంద్రుడు ఎంతో దూరం..

కలువకు చంద్రుడు ఎంతో దూరం.. కమలానికి సూర్యుడు మరీ దూరం.
కలువకు చంద్రుడు ఎంతో దూరం.. కమలానికి సూర్యుడు మరీ దూరం..
దూరమైన కొలదీ పెరుగును అనురాగం ..
దూరమైన కొలదీ పెరుగును అనురాగం ... విరహం లోనే ఉన్నది అనుబంధం.
కలువకు చంద్రుడు ఎంతో దూరం.. కమలానికి సూర్యుడు మరీ దూరం..
నవ్వు నవ్వుకు తేడా ఉంచుంది ... నవ్వే అదృష్టం ఎందరికుంటుంది
ఏ కన్నీరైనా వెచ్చగ ఉంటుంది ... అది కలిమిలేములను మరిపిస్తుంది
కలువకు చంద్రుడు ఎంతో దూరం.. కమలానికి సూర్యుడు మరీ దూరం..
వలపు కన్నా తలపే తీయన .. కలయిక కన్నా కలలే తీయన
చూపుల కన్నా ఎదురు చూపులే తీయనా .. నేటి కన్నా రేపే తీయనా
కలువకు చంద్రుడు ఎంతో దూరం.. కమలానికి సూర్యుడు మరీ దూరం..
మనసు మనిషిని మనిషిగ చేస్తుంది .. వలపా మనసుకు అందాన్నిస్తుంది
ఈ రెండూ లేక జీవితమేముంది .. ఆ దేవుడికీ మనిషికీ తేడా ఏముంది ......
చిత్రం చిల్లర దేవుళ్ళు
గాత్రం బాలసుబ్రహ్మణ్యం

No comments: