Thursday, March 20, 2008

విశ్వం వర్ణమయం

కిటికీ లోంచి బయటకు చూసా
కంటికీ మింటికీ మధ్య ఏడు రంగుల విన్యాసం
చుట్టూ తోటంతా వర్ణాలు
ఫూలు , పండ్లు ,
క్రిములు ,కీటకాలు
పక్షులు ,చేపలు
రంగుల మయం
రంగులయిపోయాక మనిషి పుట్టుంటాడు

తొలిరంగు నాదంది మబ్బుల మధ్య ఆకాశం
భూమి , నీరు , నిప్పూ
గాలి కూడా గొట్టాల్లో దూరి
రంగులు చిమ్ముతుందీ
సూరీడు కొండెనక
పిచ్చిరంగులు పులుముతున్నాడు
కఠిన తపస్సు చేస్తేనే కళ్ళు చెదిరే రంగులు
అంటున్నాయి సీతాకోకచిలుకలు


--00--

హుం....ప్చ్ ...నలుపు తెలుపులే మనకు మిగిలాయి
అనుకుంటూ వెనుతిరిగా ......
ఇంతలో నా గదిలోనే ఎగసిపడ్డాయి రంగులు
అంతా వర్ణమయం
తడిసిపోయి తల తిప్పి చూసా
నా బుజ్జి కన్నా.. నిద్దట్లోనే నవ్వుకుంటున్నాడు.......

......

No comments: