Monday, March 9, 2009

శిలలపై శిల్పాలు చెక్కినారు ...చిత్రం : మంచి మనసులు

అహో ఆంధ్ర భోజా శ్రి కృష్ణా దేవరాయా
విజయ నగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజా
ఈ శిధిలాలలో చిరంజీవి వైనావయా

శిలలపై శిల్పాలు చెక్కినారు

శిలలపై శిల్పాలు చెక్కినారు
మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు

శిలలపై శిల్పాలు చెక్కినారు
కను చూపు కరువైన వారికైనా

కను చూపు కరువైన వారికైనా

కనిపించి కనువిందు కలిగించు రీతిగా

కను చూపు కరువైన వారికైనా
ఒకవైపు ఉర్రూతలూపు కవనాలు

ఒకప్రక్క ఉరికించు యుద్ధ భేరీలు
ఒకచెంప శృంగారమొలిగించు నాట్యాలు
నవరసాలొలిగించు నగరానికొచ్హాము
కనులు లేవని నీవు కలత పడవలదు
కనులు లేవని నీవు కలత పడవలదు
నా కనులు నీవిగా చేసికొని చూడు
శిలలపై ........

ఏక శిల రధముపై లోకేశు ఒడిలోన
ఓరచూపుల దేవి ఊరేగి రాగా
రాతి స్తంభాలకే చేతనత్వము కలిగి
సరిగమ పదనిస స్వరములే పాడగా
కొంగు ముడి వేసుకొని క్రొత్త దంపతులు
కొంగు ముడి వేసుకొని క్రొత్త దంపతులు
కొడుకు పుట్టాలని కోరుతున్నారనిశిలలపై
రాజులే పోయినా రాజ్యాలు కూలినా
కాలాలు పోయినా గాల్పులే వీచినా
మనుజులే దనుజులై మట్టి పాల్జేసినా అ....
.. చెదరనీ కదలనీ శిల్పాలవలెనె నీవు

నా హౄదయాననిత్యమై సత్యమై
నిలిచి వుందువు చెలి నిజము నా జాబిలి

No comments: