
ఘంటసాల జన్మదిన సందర్భంగా
విన్నవించుకోనా చిన్న కోరిక
ఇన్నాళ్ళు నా మదిలో ఉన్న కోరిక... (విన్న)
నల్లని నీ కురులలోతెల తెల్లని సిరిమల్లెనై (౨)
పరిమళాలు చిలుకుతూ నే పరవశించి పోనా.. (విన్న)
వెచ్చని కౌగిట పవళించిన నవ వీణనై (౨)
రాగమే అనురాగమై నీ మనసు నిండిపోనా .. (విన్న)
తీయని నీ పెదవిపై చెలరేగిన ఒక పాటనై (౨)
అందరాని నీలి నింగి అంచులందుకోనా .. (విన్న)
చల్లని నీ చూపులే చెలివెన్నెలై విరబూయగా
కలువనై నీ చెలియనై నీ కన్నులందు వెలిగేనా.. (విన్న)
No comments:
Post a Comment