Friday, December 28, 2007

కల కానిది విలువైనది ..(song)

కల కానిది విలువైనది బ్రతుకు
కన్నీటి ధారలలొనే బలి చేయకు

గాలి వీచి పూవుల తీగ నేల వాలి పోగా

జాలి వీడి అటులె దాని వదలి వైతువా
చేర దీసి నీరు పొసి చిగురించ నీయవా

కల కానిది విలువైనది బ్రతుకు

కన్నీటి ధారలలొనె బలి చేయకు

అలముకున్న చీకటిలొనె అలమటించనేల

కలతలకె లొంగి పొయి కలవరించనేల
సాహసమను జ్యొతిని చేకొని సాగిపొ

కల కానిది విలువైనది బ్రతుకు

కన్నీటి ధారలలొనె బలి చెయకు

అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే

శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే
ఎది తనంత తానై నీ దరికి రాదు
సొధించి సాధించాలి అదియే ధీర గుణం

కల కానిది విలువైనది బ్రతుకు

కన్నీటి ధారలలొనె బలి చెయకు

1 comment:

gsmanyam said...

naaku ee paaTa chaalaa ishTam saaruu, adbutamaina saahityam unna paata idi