Friday, December 21, 2007

ఎక్కడ ఉన్నా ఏమైనా.. (song )

ఎక్కడ వున్నా ఏమైనా
మనమెవరికి వారై వేరైనా
నీ సుఖమే నే కోరుతున్నా
నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా

అనుకున్నామని జరగవు అన్నీ
అనుకోలేదని ఆగవు కొన్నీ
జరిగేవన్నీ మంచికని
అనుకోవడమే మనిషి పని॥ (నీ సుఖమే)

పసిపాపవలె ఒడి జేర్చినాను
కనుపాప వలె కాపాడినాను
గుండెను గుడిగా చేసాను
నువ్వుండలేనని వెళ్ళావు ॥(నీ సుఖమే)

వలచుట తెలిసిన నా మనసునకు
మరచుట మాత్రము తెలియనిదా
మనసిచ్చినదే నిజమైతే
మన్నించుటయే ఋజువు కదా!॥ (నీ సుఖమే)

నీ కలలే కమ్మగ పండనీ
నా తలపే నీలో వాడనీ
కలకాలం చల్లగ వుండాలని
దీవిస్తున్నా నా దేవిని
దీవిస్తున్నా నా దేవిని ..(నీ సుఖమే)

No comments: