Wednesday, December 12, 2007

వేకువా....ఆగవా.!!



రాత్రికి కూడా చీకటయ్యింది..
నువ్వెప్పుడొస్తావో
అందాకా ఎంచుకో అంటూ
బారులు తీరిన తారలు
వడి వడిగా
అడ్డం పడుతూ మేఘాలు
పరధ్యానంగా నేను
నీ ధ్యానం లో ఊహలు
వెనకుండలేమని
మారాం చేస్తు ముంగరులు
వడలిన మోము
వాడిపోతున్న పూలు
ఇంకో ఘడియ ఆగితె బావుణ్ణు...
వేగిరపడుతున్న వేకువ

1 comment:

Prasanthi said...

idi kuudaa baagundi. again first line is the most impressive one. Few other lines are also good.