
తొలిసంధ్య వేళలో
తొలిపొద్దు పొడుపులో
తెలవారే తూరుపులో
వినిపించే రాగం భూపాలం
యెగిరొచ్చే కెరటం సింధూరం
జీవితమే రంగుల వలయం
జీవితమే రంగుల వలయం
దానికి ఆరంభం సూర్యుని ఉదయం
గడిచే ప్రతి నిమిషం ఎదిగే ప్రతిబింబం
వెదికే ప్రతి ఉదయం దొరికే ఒక హ్రుదయం
ఆ హ్రుదయం సంధ్యా రాగం మేలుకొలిపే అనురాగం
సాగరమే పొంగుల నిలయం
సాగరమే పొంగుల నిలయం
దానికి ఆలయం సంధ్యా సమయం
వచ్చే ప్రతి కెరటం చేరదు అది తీరం
లేచే ప్రతి కెరటం అది అంటదు ఆకాశం
ఆ ఆకాశంలో ఒక మేఘం మేలుకొలిపే అనురాగం
No comments:
Post a Comment