Sunday, November 18, 2007

ఏ దివిలో విరిసిన పారిజాతమో ..(song)


ఏ దివిలో విరిసిన పారిజాతమో

ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో

నా మదిలో నీవై నిండిపోయనే

ఏ దివిలొ

నీ రూపమే దివ్య దీపమై

నీ నవ్వులే నవ్య తారలై

న కన్నుల వెన్నెల కాంతినింపెనే

ఏ దివిలొ

పాల బుగ్గలను లేత సిగ్గులు

పల్లవించగ రావే

నీలి ముంగురులు పిల్లగాలితో

ఆటలాడగా రావే

కాలి అందియలు ఘల్లు ఘల్లు మన

రాజహంసల రావే

ఏ దివిలొ

నిదుర మబ్బులను మెరుపు తీగవై

కలలు రేపినది నీవే

బ్రతుకు వీణపై ప్రణయ రాగములు

అలపించినది నీవే

పదము పదములో మధువులూరగా

కావ్య కన్యవై రావే

ఏ దివిలొ

No comments: