Tuesday, November 6, 2007

నీలి మేఘాలలో


నీలి మేఘాలలో గాలి కెరటాలలో
ఓ మేఘం పాడె పాటవినిపింతు నీ వేళ...........

ఆకాశం మేఘావృత్తం..నల్లని దుప్పటి కప్పినట్టు.బయట పోదామంటె భయం..అసలు మేఘమంటె ఏమిటి..???ఇన్నినీళ్ళు ఎక్కడున్నయో , ఎలామోసుకెళ్తుందో పైకి..ఎప్పుడో చదివిన పాఠం గుర్తుకొచ్చింది..భూమ్మీది .సముద్రం లోది నీరు ఆవిరిగ మారి ఆకాశమెక్కి చల్లగా వర్షం కురిపిస్తాయని.. నిజమా..?

నీరు ఆవిరిగా మారలంటె 100 డిగ్రీలు వేడెక్కాలి..టీవీ లలో చూపే ఉష్ణోగ్రత ఎప్పుదూ 46 లేక 47 దాకాపోతుంది..ఎండాకాలంలో..మరి ఎలా ఆవిరౌతుందబ్బా...? ఇదో సందేహం..ఈ వయసులో ఎవరిని అడుగను.. మీ కేమైనా తెలిస్తె చెప్పండి.

సరే పోయిందే అనుకో మరి తెల్ల మేఘాలు ఎందుకు వర్షించవు.దూది పింజల్ల వేగంగా ఉరికి పోతూ ఉంటాయే. అదెలా కొన్ని నల్ల మేఘాలే వర్షిస్తాయి. బుర్ర వేడెక్కుతుంది.వర్షం వచ్చినా బావుణ్ణు.!!

నా ఊహలు పసిగట్టాయేమో ..గట్టిగా ఉరుము తున్నాయి..సెర్చ్ లైటేసి వెతుకు తున్నాయి నాకోసం.అసలు ఎండాకాలం వేడికే కదా నీళ్ళు ఆవిరవ్వాలిఇదెంటి మరి ప్రత్యేకంగా ఓ చల్లని కాలంలో కురుస్తాయి..ఇన్ని రోజులు ఎక్కదుంటాయి..వీటికి టైం ఎలా తెలుస్తుంది. అయినా ఇవి కూడ ఇప్పుడు మన పంక్చువాలిటీ పాటిస్తున్నాయిలే.ప్రాణి పుట్టినప్పటి నుంచి పైకి కిందకి చక్కర్లాయె విసిగి పోయుంటాయి.

నాకు నచ్చిందల్లా..అన్ని యుగాల్లోను..ఓ ప్రత్యేక పాత్రను పోషిస్తు వస్తున్నాయి..సందేశాలు ,రాయబారాలు..ప్రేమికులు, కవులు ఎంత ఆదరిస్తారో. రాత్రనక పగలనక నెత్తిమీదే తిరుగుతుంటాయిగా..తోదుగా...వాళ్ళ పిచ్చి ఊహలకు తగ్గ రూపాలు ధరిస్తూ.

ఇక వర్షం వచ్చే సూచన లేదు కానీ ..నే కదులుతా...........

3 comments:

Padma said...

ఫొటో బ్రహ్మాండంగా ఉందిగా. మీ బాల్కనీ నించి తీసినదేనా?

raghu said...

అదరగొట్టారు మేష్టారూ. ముఖ్యంగా చివరి వాక్యం. వాహ్ !

భవదీయుడు
రఘు

mirror said...

yes padma...good catch..