
మురిపించే అందాలే అవి నన్నే చెందలే (౨)
నా దానవు నీవెలె నీవాడను నెనేలే
దారిచేర రావే సఖి నా సఖి
ప్రేయసి సిగ్గేల
మరపించే మురిపాలే కరిగించే కెరటాలై
నిదురించే భావాలా కదిలించే ఈవేళా
అదే హాయికాదా? సఖా నాసఖా! (మురిపించె)
చెలి తొలిచూపే మంత్రించినే
ప్రియసఖురూపే మదినేలెనే (౨)
ఇది యెడబాటు కనలేని ప్రేమ
ఇల మనకింక సురలోక సీమ (౨)
ఇదే హాయి కాదా సఖా నాసఖా (మురిపించె)
అనురాగాల రాగాలలో
నయగారాల గారాలలో (౨)
మధుమాధుర్యమే నిండిపోయే
హృదయానందమే పొంగిపోయే (౨)
దరిచేరరావే సఖీ నాసఖీ! (మురిపించె)
No comments:
Post a Comment