Friday, April 18, 2008

తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసము

తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసము
మల్లె పూలు పెట్టుకున్నదెవరి కోసము


తెల్ల చీర కట్టినా మల్లె పూలు పెట్టినా
కల్ల కపటమెరుగని మనసు కోసము
మనసు లోని చల్లని మమత కోసము (తెల్ల)


దాచుకున్న మమతలన్ని ఎవరి కోసము
దాపరికం ఎరుగని మనసు కోసము
దాగని యవ్వనం ఎవరి కోసము
దాచుకుని ఏలుకునే ప్రియుని కోసము (తెల్ల)


అద్దాల చెక్కిళ్ళు ఎవరి కోసము
ముద్దైన నీ మోవి ముద్దు కోసము
పొద్దంతా కలవరింత ఎవరి కోసము
నిద్దురైనా రాని నీ కోసము (తెల్ల)


నింగి నేల కలసినది ఎవరి కోసము
నీవు నన్ను చేర దీసినందు కోసము
నేల మీద ఒక్కటై సాగి పోదము
నింగి లోన చుక్కలై నిలిచి పోదము (తెల్ల)

No comments: