Monday, April 28, 2008

ఈ నాటి ఈ హాయీ కల కాదోయి

ఈనాటి ఈహాయి కల కాదోయి నిజమోయి
నీవూహతోనే పులకించిపోయే ఈ మేను నీదోయీ

నీకోసమే ఈ అడియాశలన్నీ
నాధ్యాస నా ఆశ నీవే కదా! (ఈనాటి)

ఏ నోము ఫలమో ఏ నోటివరమో
ఈప్రేమ జవరాలా!
మనియేములే యిక విరితావిలీలా
మన ప్రేమ కెదురేది లేదేసఖీ (ఈనాటి)

ఊగేములే తులతూగేములే
యిక తొలి ప్రేమ భోగాలా
ఊగేములే తులతూగేములే
యిక తొలి ప్రేమ భోగాలా
మురిపాల తేలే మన జీవితాలు
దరహాస లీలా విలాసాలులే (ఈనాటి)


No comments: